Advertisement
Google Ads BL

పుష్ప కలెక్షన్స్ కి కోలుకోలేని దెబ్బ


అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ నిన్న శుక్రవారం డిసెంబర్ 17 న వరల్డ్ వైడ్ గా ఐదు భషాల్లో రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన ప్రతి భాషలోనూ పుష్ప ప్రభంజనం చూపించింది. ఓవర్సీస్ దగ్గర నుండి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ఇలా అన్ని భాషల్లోనూ పుష్ప సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.. హిందీ లెక్కల్లో కొద్దిగా తిక మక అయినా.. మిగతా అన్ని భాషల్లో పుష్ప తో అల్లు అర్జున్ సత్తా చాటాడు.. సినిమాపై ఉన్న క్రేజ్, క్రేజీ కాంబినేషన్, హిట్ కాంబినేషన్ గా సుకుమార్ - అల్లు అర్జున్ కనిపించడం, మూవీ నేపథ్యం అన్ని సినిమాపై హైప్ క్రియేట్ చేసాయి. దానితో సినిమా కి భారీ గా ఓపెనింగ్స్ కలెక్షన్స్ రాబట్టింది.

Advertisement
CJ Advs

అయితే పుష్ప కలెక్షన్స్ ని లీకులు వీరులు కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఎప్పటినుండో పైరసీని ప్రోత్సహిస్తోన్న తమిళ్ రాకర్స్, మూవీ రూల్జ్ వంటి సంస్థలు ఎన్నో భారీ బడ్జెట్, పెద్ద చిత్రాలను ఆన్‌లైన్‌లో పెట్టేసి నిర్మాతలను కోలుకోలేని దెబ్బకొట్టినట్టుగా.. పుష్ప సినిమా విడుదలైన మొదటి షోకే మూవీని తమిళ్ రాకర్స్, మూవీ రూల్జ్ లాంటి వెబ్ సైట్స్ లో అప్ లోడ్ చేసి.. లింక్స్ పెట్టెయ్యడం తో.. పుష్ప కలెక్షన్స్ పై ఎంతో కొంత కాదు.. ఆ ప్రభావం ఎక్కువగానే పడేటట్లు కనబడుతుంది. పుష్ప విడుదలైన గంటల వ్యవధిలోనే సినిమా ఆన్ లైన్ లో వచ్చెయ్యడంతో.. థియేటర్స్ కి వెళ్ళని ప్రేక్షకులు ఆ లింక్స్ ఓపెన్ చేసి సినిమాని వీక్షించెయ్యడంతో.. పుష్ప సినిమా కలెక్షన్స్ భారీ గండి పడే ప్రమాదం కనబడుతుంది. ఈ పైరసీ ఆగడాలు అరికట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఈ పైరసీని అరికట్టడం మాత్రం సాధ్యం కావడం లేదు.

Pushpa The Rise full HD movie leaked:

Pushpa: The Rise Full HD Available For Free Download
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs