పుష్ప ది రైజ్ అంటూ అల్లు అర్జున్ ఐదు భషాల్లో నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప సినిమా కి అదిరిపోయే టాక్ వచ్చేసింది. యుఎస్ ప్రీమియర్స్ తోనే పుష్ప మూవీ అంచనాలు తెగ్గొట్టేసింది.. తగ్గేదే లే తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో .. ఆ రేంజ్ లోనే పుష్ప సినిమాకి టాక్ పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. అల్లు అర్జున్ మొదటి రోజు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని మలయాళం, కన్నడ, తమిళంలోనూ సాదించింది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే పుష్ప రికార్డులు సృష్టించింది. కన్నడ, మలయాళం, తమిళ్ లోను అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ ఉంది. అదే క్రేజ్ తో పుష్ప కి అన్ని చోట్ల భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.
కాకపోతే ఒక్కచోట అల్లు అర్జున్ కి ఎదురు దెబ్బ తగిలింది అనే చెప్పాలి. అదే హిందీ. బాలీవుడ్ లో అల్లు అర్జున్ పుష్ప కి బెస్ట్ ఓపెనింగ్స్ రాలేదనే చెప్పాలి. మొదటి నుండి హిందీ రిలీజ్ పై కన్ఫ్యూజన్ ఏర్పడడం.. సినిమా రిలీజ్ అయ్యే చివరి నిమిషం వరకు పుష్ప సినిమా ప్రమోషన్స్ చెయ్యకపోవడం తో పుష్ప సినిమా నార్త్ ఆడియన్స్ లో పెద్దగా రిజిస్టర్ అయినట్లుగా కనిపించకపోవడం, పబ్లిసిటీ విషయంలో ఎంతో పర్ఫెక్ట్ గా బాలీవుడ్ లో పీఆర్ టీం ని మెయింటింగ్ చేసే అల్లు అర్జున్ పుష్ప విషయం లో ఫెయిల్ అవడం, ఇక సినిమాలో అంతా సౌత్ ఆర్టిస్ట్ లే ఉండడం తో నార్త్ ప్రేక్షకులకి పుష్ప అంతగా ఎక్కలేదనిపిస్తుంది. అందుకే పుష్ప సినిమాకి అక్కడ బరి ఓపెనింగ్స్ పడలేదనిపిస్తుంది.
మరి నాలుగు భాషల్లో తన హవా గట్టిగా చూపిన అల్లు అర్జున్ నార్త్ లో మాత్రం తన క్రేజ్ చూపించలేకపోయాడనే చెప్పాలి.