రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ మూవీ రిలీజ్ ప్రమోషన్స్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ ఐదు భాషల్లో సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా ట్రైలర్ తోనే రిలీజ్ వరకు మట్లాడుకునేలా చేసిన రాజమౌళి.. ప్రమోషన్స్ ని కూడా పెద్ద ఎత్తున చర్చించునే విధంగా నిర్వహిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ తెరకెక్కించడం కాదు.. దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకుని వెళ్లడమే పెద్ద సవాల్ అన్నట్టుగా రాజమౌళి తన సినిమాల్ని ప్రమోట్ చేస్తారు. రాజమౌళి ప్రమోషన్స్ స్ట్రాటజీ ల ముందు హాలీవుడ్ కూడా పనికి రాదనేలా ఉంటాయి. ఇక హైదరాబాద్, ముంబై, బెంగుళూరు, చెన్నై లలో ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్స్ తో ఆసక్తి రేపిన రాజమౌళి.. సినిమా రిలీజ్ అయ్యేవరకు తన శక్తి మేర ప్రమోట్ చేస్తానని చెప్పారు.
అన్నట్టుగానే రాజమౌళి ముంబై వేదికగా.. నార్త్ ప్రేక్షకులు ఆర్.ఆర్.ఆర్ గురించి మట్లాడుకునేలా.. ఒక ఈవెంట్ ని ఆదివారం సాయంత్రం ప్లాన్ చెయ్యడమే కాదు.. రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్, అజయ్ దేవగన్ తో పాటుగా కీరవాణి, నిర్మాత దానయ్య, ఇంకా ఆర్.ఆర్.ఆర్. ఆర్ టీం కూడా పాల్గొంటుంది. మరి టీం మొత్తం హాజరైతే అందులో మజా ఏముంటుంది. అందుకే బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ ని ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ కి గెస్ట్ గా పిలిచి షాకిచ్చారు. గెస్ట్, టీం ఉండగా.. దానికి ఓ యాంకర్ హోస్ట్ గా ఉంటే ఏం బావుంటుంది.. బాలీవుడ్ ఈవెంట్స్ ని బడా స్టార్స్ యాంకరింగ్ చేసినట్టుగా ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ కి బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ చేయబోవడం హాట్ టాపిక్ అయ్యింది. రాజమౌళి.. ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ ని ఏ రేంజ్ లో ప్లాన్ చేసి నార్త్ ప్రేక్షకులని సర్ ప్రైజ్ చేయబోతున్నారో అనేది నిజంగా సర్ ప్రైజింగ్ గా ఉంది.. రాజమౌళినా మజాకానా..