అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన మాస్ మూవీ పుష్ప ఐదు భాషల్లో నేడు డిసెంబర్ 19 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో భారీ ప్రమోషన్స్ తో బరిలోకి దిగిన టాలీవుడ్ పాన్ ఇండియా మూవీ పుష్ప పుష్ప రాజ్ అంటూ అల్లు అర్జున్ అభిమానుల కోలాహలం పుష్ప రిలీజ్ అయిన థియేటర్స్ దగ్గర మాములుగా లేదు. కరోనా పాండమిక్ తర్వాత విడుదలవుతున్న బిగ్ మూవీ, పాన్ ఇండియా మూవీ పుష్ప అవడంతో.. అన్ని భాషల్లో అంచనాలు పెరిగిపోయాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ రోజే విడుదలైన పుష్ప మూవీ ప్రీమియర్స్ ఓవర్సీస్ లో గత రాత్రి నుండే మొదలై అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అలాంటి హిట్ కాంబినేషన్ తో ఉన్న సుక్కు - అల్లు అర్జున్ లు పుష్ప తో ఎలాంటి టాక్ అందుకున్నారో.. ఓవర్సీస్ ప్రేక్షకుల మాటల్లో.
అల్లు అర్జున్ పుష్ప రాజ్ లుక్ లో అదరగొట్టేసాడని, పెరఫార్మెన్స్ పరంగా అద్భుతం అని అల్లు అర్జున్ రోల్ నెవర్ బిఫోర్ అనేలా ఉంది అని, అల్లు అర్జున్ పుష్ప లా ఆ యాటిట్యూడ్, మ్యానరిజం పీక్స్‌లో ఉన్నాయని, అలాగే యాక్షన్ సన్నివేశాలు, ఎలివేషన్ సీన్స్ అదిరిపోయాయని అంటున్నారు. అయితే దేవిశ్రీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్దగా వర్కవుట్ కాలేదనే అభిప్రాయాన్ని ఓవర్సీస్ ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. పుష్ప వన్ మ్యాన్ షో అని, ఇది అల్లు అర్జున్ బెస్ట్ ఫిలిం అవుతుందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. అల్లు అర్జున్ పెరఫార్మెన్స్ తో పాటు ఇంటర్వెల్ సీన్స్, ఇంకా పుష్ప కి క్లైమాక్స్ సీన్స్ పాజిటివ్ పాయింట్ అయ్యాయని.. అయితే అల్లు అర్జున్- రష్మిక నడుమ రొమాన్స్, ఇంకా కొన్ని సీన్స్ సినిమాకి మైనస్ పాయింట్స్ గా చెబుతున్నారు. అలాగే విలన్ గా సునీల్ రోల్, అనసూయ రోల్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బావుంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్, ఆయన మాట్లాడిన స్లాంగ్, అల్లు అర్జున్ కామెడీ టైమింగ్, అలాగే అల్లు అర్జున్ ఎమోషన్స్ అన్నీ బావున్నాయని అంటున్నారు. అయితే మొదటి నుండి విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన సమంత స్పెషల్ సాంగ్ థియేటర్స్ లో నిజంగానే కేకలు పెట్టించిందని చెబుతున్నారు. కాకపోతే పుష్ప పార్ట్ వన్ ఎండ్ అనేది ఇవ్వలేదని, రెండో భాగం వస్తేనే సినిమా కంప్లీట్ అవుతుందని ఓవర్సీస్ ప్రేక్షకులు చెబుతున్న మాట.