Advertisement
Google Ads BL

పూరిపై దేవరకొండ ఫాన్స్ ఫైర్


టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ అంటే .. ఎలాంటి హీరోలనైనా మాస్ గా ప్రొజెక్ట్ చెయ్యడంలో దిట్ట. అలాగే సినిమాని కొద్ది నెలలో కంప్లీట్ చేసి విడుదల చెయ్యడంలో పూరి కి ఎవరు పోటీ ఇవ్వలేరు. పూరి జగన్నాధ్ కి ఓ స్టయిల్ ఉంటుంది.. దానికి హీరోలు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయితే సినిమా సూపర్ హిట్టే. రాజమౌళి, సుకుమార్ లాగా.. చెక్కిందే చెక్కడు, తీసిందే తియ్యడు.. ఏదైనా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఉంటుంది ఆయన వ్యవహారం. అయితే ఇప్పుడు పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ తో తెరకెక్కిస్తున్న లైగర్ మూవీ విషయంలో నాన్చుతున్నాడు. అసలే కరోనా తో చాలా టైం వేస్ట్ అయ్యింది. చాలామంది దర్శకులు ఎలాగో షూటింగ్స్ కంప్లీట్ చేసి.. రిలీజ్ కి ఆసక్తి చూపుతుంటే.. విజయ్ దేవరకొండ - పూరి లు కూల్ గా వున్నారు. రిలీజ్ డేట్ అంటూ అప్ డేట్ ఇచ్చేసరికి వచ్చే ఏడాది మార్చ్ లేదా సమ్మర్ కి లైగర్ వస్తుంది అని రౌడీ ఫాన్స్ ఆశపడ్డారు.

Advertisement
CJ Advs

కానీ రౌడీ ఫాన్స్ కి పాన్ ఇండియా ప్రేక్షకులకి షాకిస్తూ లైగర్ మూవీ ని ఆగస్టు 25 2022 లో రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా డేట్ ఇచ్చేసరికి.. విజయ్ ఫాన్స్ ఒక్కసారిగా పూరి పై పడ్డారు. చిన్నపాటి షెడ్యూల్ మాత్రం బ్యాలెన్స్ ఉన్న లైగర్ రిలీజ్ కి ఇంత ఆలస్యం దేనికి.. పూరి చాలా స్పీడు.. కానీ లైగర్ విషయంలో ఎందుకు లేటు.. ఎంత పాన్ ఇండియా ఫిలిం అయినా.. ఆయన టార్గెట్ ఫిక్స్ చేస్తే.. ఏదైనా ఫినిష్ అవ్వాల్సిందే.. కానీ లైగర్ విషయంలో పూరి స్లో ని విజయ్ ఫాన్స్ మెచ్చలేకపోతున్నారు. అందుకే ఆయనపై ఫైర్ అవుతున్నారు. ఎప్పుడూ రాజమౌళిని, సుకుమార్ ని తిట్టుకునే ఫాన్స్.. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి పూరి ని చేర్చేసారు. రాజమౌళి, సుక్కు లు అంటే.. చెప్పినట్టుగా ఏది చెయ్యరు.. ఇప్పుడు ఆ లిస్ట్ లో పూరి కూడా చేరడంతో విజయ్ దేవరకొండ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.

Devarakonda Fans Fire on Puri Jagannadh:

<span>Liger update: glimpse treat and release date locked</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs