పుష్ప రిలీజ్ డేట్ విషయంలోనే కాదు.. పుష్ప సినిమా రిలీజ్ డేట్ ఇవ్వకముందు నుండే అల్లు అర్జున్ పుష్ప విషయంలో ఎక్కడా తగ్గేదే లే అంటూ చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. ఐదు భాషల్లో రిలీజ్ కి సిద్దమైన పుష్ప ప్రమోషన్స్ ని ఒక వారం రోజులుగా అల్లు అర్జున్ సింగిల్ హ్యాండ్ తో అల్లాడిస్తున్నాడు. రేపు రిలీజ్ కాబోయే సినిమాని ప్రేక్షకుల మైండ్ లో రిజిస్టర్ అయ్యేలా పుష్ప ప్రెస్ మీట్స్ పెడుతున్నాడు. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్, చెన్నై లో ప్రెస్ మీట్, సాయంత్రానికి మళ్ళీ హైదరాబాద్ లో అల్లు అర్జున్ ప్రెస్ మీట్, తర్వాత రోజు బెంగుళూరు. కొచ్చి లలో ప్రెస్ మీట్స్ పెట్టి.. ఈరోజు గురువారం ముంబైలో ఉదయం ప్రెస్ మీట్ సాయంత్రానికి మళ్ళీ హైదరాబాద్ ప్రెస్ మీట్స్ అంటూ ప్రమోషన్స్ ని దడదడలాడించేసాడు అల్లు అర్జున్.
అయితే ఎక్కడ ప్రెస్ మీట్ కి వెళ్లినా, ఛానల్స్ ఇంటర్వ్యూలో కానీ అల్లు అర్జున్ తగ్గేదే లే అంటున్నాడు కానీ.. సినిమా సక్సెస్ మీద కాన్ఫిడెంట్ మిస్సవుతుందేనిపిస్తుంది. మన సినిమా ఐదు భాషల్లో విడుదలవుతుంది.. ఒక్క సినిమానే, నాలుగు సినిమాల కష్టం.. రేపు విడుదల కాబోయే సినిమాకి ప్రేక్షకులే తీర్పు అంటున్నాడు. అలాగే చెన్నై ప్రెస్ మీట్ లో దేవిశ్రీ పుష్ప బ్లాక్ బస్టర్ అన్నాడు.. అది నేను చెప్పలేదు అంటున్నాడు కానీ.. మన సినిమా బ్లాక్ బస్టర్ HIT కొట్టడం ఖాయం అని మాత్రం అల్లు అర్జున్ ఎక్కడా చెప్పడం లేదు.. అది చూసిన చాలామంది నెటిజెన్స్ తగ్గేదే లే.. తగ్గేదే లే అంటున్నా అందులో కాన్ఫిడెంట్ కనిపించడం లేదే.. అంటున్నారు.