Advertisement
Google Ads BL

నిర్మాతలను బ్లాక్ మెయిల్ చేస్తున్న వైసీపీ మినిస్టర్


ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ ఇండస్ట్రీపై కక్ష కట్టింది. ఏపీలో తక్కువ టికెట్ రేట్స్ కే సినిమాలను థియేటర్స్ లో ఆడించాలని, పెద్ద సినిమాలకు కూడా నాలుగు షోస్ కే పరిమితం చెయ్యాలి అంటూ చట్టాలు తీసుకువచ్చింది. టాలీవుడ్ పెద్దలు ఎంత సన్నిహితంగా ఏపీ ప్రభుత్వంతో ఉంటున్నప్పటికీ, ఎన్ని చర్చలు జరుపుతున్నప్పటికీ.. ఏపీ సర్కార్ దిగి రావడం లేదు. ఆన్ లైన్ టికెటింగ్ కి ఓకె చెప్పిన టాలీవుడ్.. తక్కువ టికెట్ ప్రైస్ కి పెద్ద సినిమాలకు వర్కౌట్ కాదంటున్నా పట్టించుకోవడం లేదు. తాజాగా ఏపీ హై కోర్టులో ఏపీ ప్రభుత్వం చేసిన టికెట్ రేట్స్ సవరణ చట్టం చెల్లదని, టికెట్  రేట్స్ పెంచుకోవచ్చు అంటూ తీర్పు చెప్పినా.. ఏపీ ప్రభుత్వం మాత్రం కోర్టు తీర్పుని సవాల్ చేస్తుంది. 

Advertisement
CJ Advs

అదలా ఉంటే.. ఇప్పటివరకు సినిమాటోగ్రఫీ పదవి లేకుండానే సినిమా ఇండస్ట్రీ పెద్దలతో మీటింగ్స్ పెట్టిన ఒక మంత్రికి..  తాజాగా జగన్ సర్కార్ పెద్ద సినిమాలు, అందులో బడా పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అవుతున్న టైం లో హడావిడిగా ఏపీ క్యాబినెట్ లో సినిమాటోగ్రఫీ శాఖతో అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. అలా బాధ్యతలు చేపట్టారో, లేదో అప్పుడే ఆ మినిస్టర్ గారు టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. టాలీవుడ్ లో బడా నిర్మాతల నుండి కోట్లకి కోట్లు దండుకుని టికెట్ రేట్స్ ఓపెంచడానికి సదరు మంత్రి గారు పావులు కదుపుతున్నారని, బడా నిర్మాతలు ఒక్కొక్కరి నుండి ఏకంగా 20 కోట్లు వసూల్ చెయ్యాలని ఆ మంత్రి గారు టార్గెట్ పెట్టుకున్నారట. 

ఇప్పటికే కొంతమంది పెద్ద నిర్మాతలకి ఫోన్స్ కూడా వెళ్లాయట. మరి నిర్మాతలు సదరు మంత్రి గారికి కోట్లు కుమ్మరిస్తే.. పెద్ద సినిమాలకు టికెట్ రేట్స్ పెంచుకునే వెసులుబాటు ఆ మంత్రి గారు కల్పిస్తారన్నమాట. మరి ఇదంతా విన్నవారు టాలీవుడ్ నిర్మాతల నుండి వైసిపి మినిస్టర్ వసూళ్ల పర్వం అంటున్నారు.

YCP Minister blackmailing Tollywood producers:

YCP Minister blackmailing Tollywood Big producers
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs