Advertisement
Google Ads BL

లైగర్ రిలీజ్ డేట్ వచ్చేసింది


విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ కలయికలో పాన్ ఇండియా స్టయిల్లో తెరకెక్కుతున్న లైగర్ సాలా క్రాస్ బ్రీడ్ మూవీ కరోనా సెకండ్ వెవ్ గనక అడ్డం పడకపోతే ఈపాటికి ప్రేక్షకుల ముందుకు వచ్చేసేదే.. కానీ సెకండ్ వెవ్ ఫాన్స్ ఆశలపై నీళ్లు చల్లింది. ఇక షూటింగ్స్ ని సెట్స్ మీద పరుగులు పెట్టించే పూరి జగన్నాధ్ లైగర్ విషయంలో కంగారు పడడం లేదు. కూల్ గానే లైగర్ షూటింగ్ ని ముంబై, గోవా, హైదరాబాద్, యుఎస్ అంటూ తిరుగుతూన్నారు. పూరి గత సినిమాల్తో పోలిస్తే లైగర్ షూటింగ్ చాలా ఆలస్యంగా జరుగుతున్నట్టే. ఇక లైగర్ కి చిన్న షెడ్యూల్ మాత్రమే పెండింగ్ లో ఉంది. ఈ షెడ్యూల్ ని ఇండియాలోనే తెరకెక్కిస్తారు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ హవా బాక్సాఫీసు వద్ద మొదలైన తరుణంలో విజయ్ దేవరకొండ లైగర్ మూవీ రిలీజ్ డేట్ కోసం ఫాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. లైగర్ యుఎస్ షెడ్యూల్ ముగించుకుని రీసెంట్ గానే హైదరాబాద్ కి వచ్చాడు విజయ్ దేవరకొండ.

Advertisement
CJ Advs

అయితే తాజాగా లైగర్ అప్ డేట్ అంటూ నిన్న బుధవారం లైగర్ టీం అందరిలో ఆసక్తి క్రియేట్ చేసింది. ఈ రోజు గురువారం ఉదయం లైగర్ సినిమా రిలీజ్ డేట్ తో పాటుగా.. లైగర్ గ్లిమ్ప్స్ ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారో చెప్పి రౌడీ ఫాన్స్ తో పాటుగా.. పాన్ ఇండియా ప్రేక్షకులని సర్ ప్రైజ్ చేసారు.. ఈ సినిమాలో బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ నటించడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా లైగర్ మూవీకి బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్ వన్ అఫ్ ద ప్రొడ్యూసర్ కావడంతో.. సినిమాపై అక్కడ హిందీలోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి.. ఇక లైగర్ మూవీ రిలీజ్ డేట్ ఆగష్టు 25 2022న రిలీజ్ డేట్ లాక్ చేసిన టీం.. లైగర్ గ్లిమ్ప్స్ ని డిసెంబర్ 31 న రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా ప్రకటించారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ అర్జున్ రెడ్డి కూడా 2017 ఆగ‌స్ట్25నే విడుద‌ల‌య్యింది. నాలుగేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ అదే తేధిన వ‌స్తున్న లైగ‌ర్ కూడా విజ‌య్ కి మ‌రో క‌ల్ట్, ఐకానిక్ మ‌రియు ట్రెండ్ సెట్టింగ్ మూవీ అవ‌నుంది. కానీ రౌడీ ఫాన్స్ కాస్త కొద్దిగా నిరాశ పడుతున్నారు. మరీ వచ్చే ఏడాది ఆగష్టు కా అంటూ దీర్ఘాలు తీస్తున్నారు వారు. 

Vijay Deverakonda LIGER release date locked:

LIGER Releasing In Theatres On 25th, August, 2022
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs