Advertisement
Google Ads BL

కత్రినాకి మాజీ బాయ్ ఫ్రెండ్స్ భారీ గిఫ్ట్స్


కత్రినా కైఫ్ ఎట్టకేలకి విక్కీ కౌశల్ ని పెళ్లి చేసుకుంది.. కెరీర్ లో సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ లతో ఫ్రెండ్ షిప్ చేసిన కత్రినా కైఫ్ వారితో బ్రేకప్ అయ్యాక.. విక్కీ కౌశల్ ని ప్రేమించి పెళ్లాడింది. రీసెంట్ గా వివాహం చేసుకున్న ఈ జంట తాజాగా మీడియా ముందుకు వచ్చింది. రాజస్థాన్ నుండి ముంబై చేరుకొని.. హనీమూన్ కి బయలు దేరిన కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌశల్ లు తమ పెళ్ళికి కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు తప్ప.. బాలీవుడ్ సెలెబ్రటీస్ కానీ, ఫ్రెండ్స్ ని కానీ ఆహ్వానించకపోయినా.. వారికి స్పెషల్ గా గిఫ్ట్ లు పంపారు. అయితే కత్రినా పెళ్లి చేసుకుంది అని తెలిసిన ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్స్ సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ లు కత్రినాకి అత్యంత ఖరీదైన గిఫ్ట్ లు ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. 

Advertisement
CJ Advs

సల్మాన్, రణబీర్ లు వాళ్ళని పెళ్ళికి పిలవకపోయినా.. కత్రినాకి సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఇచ్చి సంతోష పెట్టారు. సల్మాన్ ఖాన్ అయితే కత్రినా కైఫ్ కి ఏకంగా మూడు కోట్లు విలువ చేసే రేంజ్ రోవర్ కారుని గిఫ్ట్ గా ఇవ్వగా.. రణబీర్ కపూర్ రెండు కోట్లు విలువ చేసే డైమండ్ నెక్ లెస్ గిఫ్ట్ గా ఇచ్చాడని తెలుస్తుంది. సల్మాన్ ఖాన్ తో కత్రినా బ్రేకప్ చేసుకున్నాక కూడా.. వారిద్దరూ కలిసి ఇప్పటికి సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో కత్రినాకి రణబీర్, సల్మాన్ ఖాన్ లు ఇచ్చిన అత్యంత ఖరీదైన గిఫ్ట్ ల గురించిన హాట్ టాపిక్కే నడుస్తుంది.

Katrina Kaif gets her most expensive wedding gift from ex boyfriend:

Katrina Kaif Exes, Ranbir Kapoor And Salman Khan Send Her The Most Expensive Gifts On Her Wedding
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs