Advertisement
Google Ads BL

పుష్ప నిర్మాతలని పక్కన పెట్టిన అల్లు అర్జున్


ఒక పెద్ద స్టార్ సినిమా రిలీజ్ అవుతోంది అంటే ఆ స్టార్ తో పాటు ఆ చిత్ర నిర్మాతలు కూడా చాలా హడావిడిగా వుంటారు. కానీ ఈ డిసెంబర్ 17 న రిలీజ్ అవ్వబోతున్న అల్లు అర్జున్ నటించిన  పుష్ప విషయం లో మాత్రం ఆలా జరగటం లేదు. దీనికి కారణం అల్లు అర్జున్ ఆ నిర్మాతల మీద చాల కోపంగా ఉండటమే కారణం అంటున్నారు. పుష్ప సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో కూడా అల్లు అర్జున్ తన బంధువులు అయిన ముత్తంశెట్టి అన్నదమ్ములని స్టేజి మీద వెనకాల ఉన్నవాళ్ళని ముందుకి పిలిపించి మాట్లాడారు. కానీ మైత్రి మూవీస్ వాళ్ళకి అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. 

Advertisement
CJ Advs

అలాగే అల్లు అర్జున్ లాంటి స్టార్ నటుడు తన సినిమా ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు కర్టసీ గా ఒక ప్రొడ్యూసర్ అయిన రావటం అరుదు. కానీ ఈ పుష్ప విషయానికి వస్తే మాత్రం నిర్మాతల జాడ అస్సలు ఎక్కడ కనిపించలేదు. దీనికి కారణం అల్లు అర్జున్ మైత్రి మూవీస్ నిర్మాతల మీద చాల కోపంగ ఉండటమే అని తెలిసింది. వాళ్ళు పుష్ప విషయం లో చాల పెద్ద పొరపాటు చేసారు మొదట్లో, అది సరిదిద్దటానికి అల్లు అర్జున్ కి చాల కష్టపడాల్సి వచ్చింది. ఈ పుష్ప ఓపెనింగ్ కాకముందే మైత్రి నిర్మాతలు ఆ చిత్ర హిందీ రైట్స్ ని ఒక కంపెనీ కి ఇచ్చేసారు. అది కనీసం అల్లు అర్జున్ కి మాట మాత్రం కూడా చెప్పలేదు. అలాగే ఈ సినిమాని ఒక ఓటిటి కి కూడా ఇచ్చేసారు.

ఈ చిత్రం మొదటి సాంగ్ రిలీజ్ చేసినప్పుడు ఈ విషయాలన్నీ బయటకి వచ్చాయి. ఎందుకంటే మైత్రి నిర్మాతలు చేసిన తప్పిదంతో అన్ని రైట్స్ ఆ చిన్న ప్రైవేట్ కంపెనీ కి ఇవ్వటం తో వాళ్ళు సాంగ్ ఎలా రిలీజ్ చేస్తారు మాకు తెలియకుండా అని నిలదీశారు. అప్పుడు తెలిసింది అల్లు అర్జున్ కి వీళ్ళు ఎంత పొరపాటు చేసారో. ఈ పొరపాటు సరి దిద్దడానికి  అల్లు అర్జున్ చాల కష్టపడాల్సి వచ్చింది. తనకు ఉన్న బాలీవుడ్ కాంట్రాక్ట్స్ ను వుపయోగించి ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఈ చిత్రం హిందీ లో సజావుగా రిలీజ్ అవ్వటానికి  అల్లు అర్జున్ చాల సుఫర్ అవ్వాల్సి వచ్చింది. ఆ నిర్మాతలు చేసిన ఈ పొరపాటు వాళ్ళు అర్జున్ వాళ్ళ మీద చాల కోపంగా వున్నారని అందుకే పక్కన పెట్టాడని తెలిసింది. అందుకే మైత్రి మూవీస్ నిర్మాతలు పుష్ప ప్రమోషన్స్ లో ఎక్కువ కనపడటం లేదు. 

Allu Arjun furious with Pushpa producers?:

Allu Arjun puts Pushpa producers aside
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs