మహేష్ బాబు గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. కొన్నాళ్ళు కాదు కొనేళ్లు నుండి మహేష్ ఈ నొప్పి తో బాధపడుతున్నాడని.. ఇప్పటివరకు మెడిసిన్ మీద ఉన్న మహేష్ బాబు కి ఆపరేషన్ తప్పనిసరి కావడంతో.. భార్యని తీసుకుని మోకాలి ఆపరేషన్ కోసం మహేష్ స్పెయిన్ వెళ్ళాడట. రీసెంట్ గా మహేష్ - నమ్రతలు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించగానే.. అందరూ మహేష్ మోకాలి శస్త్ర చికిత్స కోసం అమెరికా వెళ్లాడని అనుకున్నారు. అయితే మహేష్ అమెరికా కాకుండా స్పెయిన్ వెళ్లి అక్కడ మోకాలి ఆపరేషన్ చేయించుకున్నారట. స్పెయిన్ నుండి మహేష్ కొద్ది కాలం విశ్రాంతి కోసం దుబాయ్ వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది.
దానితో మహేష్ బాబు రీసెంట్ మూవీ సర్కారు వారి పాట షూటింగ్ రెండు నెలలు బ్రేకివ్వడం తప్పనిసరి అయ్యింది. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు సర్కవారు వారి పాట చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ ఆపరేషన్ తో సర్కారు వారి పాట షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి.. ఎలాగూ సంక్రాంతి బరి నుండి తప్పుకుని సమ్మర్ కి వెళ్లడంతో.. ఇప్పుడు మహేష్ గురించిన బెంగ కూడా ఫాన్స్ కి లేదు.. మహేష్ రెండు నెలలు రెస్ట్ తీసుకున్నా.. అనుకున్న టైం కి సర్కారు వారి పాట వచ్చేస్తుంది అనే ధీమాతో ఉన్నారు.