అల్లు అర్జున్ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం పుష్ప మూవీ రేపు శుక్రవారం ఐదు భాషల్లో విడుదల కాబోతుంది. అయితే పుష్ప సినిమాకి ఇప్పుడు ప్రమోషన్స్ కష్టాలు వెంటాడుతున్నాయి. అంటే పుష్ప కి అల్లు అర్జున్ తన వే లో తన ప్రమోషన్స్ చేసేస్తున్నాడు. కాకపోతే అందరూ మరో పాన్ ఇండియా ఫిలిం ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ తో పుష్ప ప్రమోషన్స్ ని పోల్చి చూడడంతో.. ఇక్కడ పుష్ప తక్కువైపోతుంది. అయితే అల్లు అర్జున్ పుష్ప ప్రమోషన్స్ ను హైదరాబాద్ నుండి మొదలు పెట్టి ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోట్ చేసాడు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పుష్ప టీం తో కొందరు మిస్సింగ్. అందులో మెయిన్ పిల్లర్ సుకుమార్, విలన్ కేరెక్టర్ ఫహద్ ఫాసిల్ ఈ ఈవెంట్ కి రాలేకపోయారు.
ఇక అల్లు అర్జున్ మంగళవారం ఉదయం చెన్నైలో పుష్ప ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అక్కడ కూడా అల్లు అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ తో పాటుగా ప్రెస్ మీట్ లో కనిపించాడు. అంటే హీరోయిన్ రష్మిక కానీ, దర్శకుడు సుకుమార్ కానీ, విలన్ కేరెక్టర్ ఫహద్ ఫాసిల్ కానీ రాలేదు. అంటే అక్కడ కూడా అల్లు అర్జున్ సోలోగానే కనిపించాడు. ఇక మళ్ళీ హైదరాబాద్ తో అల్లు అర్జున్ సోలో ఇంటర్వ్యూ పెట్టాడు. మరి ఆర్.ఆర్.ఆర్ లో జస్ట్ 15 నిమిషాల రోల్ లో కనిపించనున్న బాలీవుడ్ భామ అలియా భట్ ని రాజమౌళి నాలుగైదు సిటీస్ లో ప్రెస్ మీట్స్ పెట్టి తమతో తిప్పేశారు. కానీ రష్మిక తమిళ్ ప్రెస్ మీట్ కి రాకపోవడం ఎవరికీ అర్ధం కాలేదు. మరి ముంబై లో, బెంగుళూర్ తో పెట్టే ప్రెస్ మీట్ కైనా అల్లు అర్జున్ కి సినిమాలోని నటులు, దర్శకుడు సుక్కు తోడవుతారేమో చూద్దాం.