Advertisement
Google Ads BL

భీమ్లా నాయక్: ఆడికన్నా గట్టిగా అరవగలను


పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీ గా భీమ్లా నాయక్ సంక్రాంతి ని దడదడలాడించడానికి రెడీ అయ్యింది. భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్, డ్యానియల్ శేఖర్ గా రానా కేరెక్టర్స్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు.. ఇప్పటివరకు భీమ్లా నాయక్ ప్రమోషన్స్ ఒక ఎత్తు.. ఇప్పటినుండి భీమ్లా నాయక్ ప్రమోషన్స్ మరో ఎత్తు అన్నట్టుగా.. ఉంది టీం వ్యవహారం.. నిన్నమొన్నటివరకు కొద్దిగా సైలెంట్ గా కనిపించిన భీమ్లానాయక్ టీం.. రానా పుట్టిన రోజు సందర్భంగా అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చింది. పోస్టర్ తోనే టీజర్ పై హైప్ క్రియేట్ చేసి.. సాయంత్రానికి డ్యానియల్ శేఖర్ టీజర్ ని వదిలింది.

Advertisement
CJ Advs

భీమ్లా నాయక్ రానా బర్త్ డే స్పెషల్ టీజర్ లో.. డ్యానియల్ శేఖర్ గా రానా పవర్ ఫుల్ గా అదరగొట్టేసాడు. భీమ్లా నాయక్ పోలీస్ స్టేషన్ ఎదుట నించుని.. వాడు అరిస్తే భయపడతావా.. ఆడికన్నా గట్టిగా అరవగలను, ఎవడాడు....దీనమ్మ దిగొచ్చాడా... ఆఫ్ట్రాల్ ఎస్ ఐ సస్పెండెడ్ అంటూ డ్యానియల్ శేఖర్ గట్టిగా అరవడం, లోపల స్టేషన్ లో ఉన్న భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్ పోలీస్ డ్రెస్ లో కూల్ గా చూసిన లుక్ కి ఫాన్స్ అయితే పడిపోతారు. మరి డ్యానియల్ శేఖర్ కి భీమ్లా నాయక్ కి మధ్యన ఈగో ఏ స్థాయిలో ఉంటుందో అది తెర మీద ఎలా కబడబోతుందో అనేది.. జనవరి 12 వరకు వెయిట్ చేయమంటూ మేకర్స్ భీమ్లా నాయక్ రిలీజ్ జనవరి 12 అని మరోసారి బల్లగుద్ది చెప్పారు.

Bheemla Nayak : Rana Daggubati Birthday Teaser:

An intense Rana Daggubati breathes fire into the frames in Swag of Daniel Shekar
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs