Advertisement
Google Ads BL

రాధే శ్యామ్ నుంచి సంచారి సాంగ్ టీజర్


ప్రభాస్ రాధే శ్యామ్ రిలీజ్ కి టైం ఇంకా నెల రోజులుంది.. అయినా గత నెల రోజుల నుండే రాధేశ్యామ్ ప్రమోషన్స్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి. బాహుబలి, సాహో తో పాన్ ఇండియా ని షేక్ చేసిన ప్రభాస్ రాధేశ్యామ్ పై విపరీతమైన అంచనాలున్నాయి. రాధాకృష్ణ తెరకెక్కించిన రాధేశ్యామ్ నుండి ప్రభాస్ ఫాన్స్ కి సరికొత్త మ్యూజిక్ ఫీల్ ఇవ్వాలి అని ప్రయత్నిస్తున్నారు మేకర్స్. దానిలో భాగంగానే సౌత్ అటు నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అత్యున్నత సంగీత దర్శకులతో పాటలు సిద్ధం చేయిస్తున్నారు రాధే శ్యామ్ టీం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని పాటలకు మంచి అప్లాజ్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి సంచారి సాంగ్ టీజర్ విడుదలయింది. జస్టిన్ ప్రభాకరన్ అద్భుతమైన సంగీతం అందించారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ సాంగ్ టీజర్ వైరల్ అవుతుంది. 

Advertisement
CJ Advs

సంచారి పూర్తి సాంగ్ డిసెంబర్ 16న విడుదల కానుంది. సంచారి పాటలో అద్భుతమైన విజువల్స్ కనిపిస్తున్నాయి. ప్రభాస్ చాలా అందంగా ఉన్నారు. జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్ నార్త్ వర్షన్స్ కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ రాధేశ్యామ్ సినిమా సంక్రాంతి స్పెషల్ గా ఐదు భాషల్లో జనవరి 14 న రిలీజ్ కి సిద్దమవుతుంది. త్వరలోనే రాధేశ్యామ్ నుండి ట్రైలర్ రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

Radhe Shyam Sanchari teaser elevates :

<span>Radhe Shyam Sanchari teaser elevates Prabhas romantically</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs