Advertisement
Google Ads BL

వైసీపీ దెబ్బ అఖండ తట్టుకుందా..?


బాలకృష్ణ అఖండకి బాక్స్ ఆఫీస్ దగ్గర లాభాలు వచ్చినా వైసీపీ దెబ్బ గట్టిగా తగిలింది. నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ కలెక్షన్స్ తో ఓవరాల్ గా సెన్సేషనల్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. సినిమా సెకెండ్ వీకెండ్ పూర్తి అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా ఎక్స్ లెంట్ అనిపించే విధంగా తెలుగు రాష్ట్రాలలో 86.35 కోట్ల గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా 105.8 కోట్ల గ్రాస్ తో దుమ్ము రేపింది అని చెప్పాలి.

Advertisement
CJ Advs

కానీ అదే టైం లో సినిమాకి ఆంధ్రలో టికెట్ రేట్లు పెంచుకొనే అవకాశం ఇవ్వక పోవడంతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొదటి రోజే బెనిఫిట్ షోలు, టికెట్ హైక్స్, స్పెషల్ షోలు లాంటివి ఉండి ఉంటే బిజినెస్ వేటలో అప్పటి నుండే సంచలనం సృష్టించేది కానీ అవేవి లేక పోవడం నార్మల్ టికెట్ రేట్స్ తోనే సినిమా రన్ ని కొనసాగిస్తూ ఉండగా ఇప్పుడు 11 రోజులు పూర్తి అయిన తర్వాత నైజాం, సీడెడ్ ఏరియాలు ఆల్ రెడీ ప్రాఫిట్ జోన్ లో ఉండగా ఆంధ్ర రీజన్ లో ఒక్క నెల్లూరు ఏరియాలోనే సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది. మిగిలిన ఏ ఏరియాలో కూడా ఇంకా బిజినెస్ ను అఖండ సినిమా అందుకోలేదు. ఒకసారి తెలుగు రాష్ట్రాలలో సినిమా ఏరియాల వారి బిజినెస్ అండ్ రికవరీని గమనిస్తే..

Nizam: 17.47/10.5Cr (లాభంతో) 

Ceded: 13.51/10.6Cr (లాభంతో)  

UA: 5.43/6Cr

East: 3.68/4Cr

West: 3.00/3.5Cr

Guntur: 4.28/5.4Cr

Krishna: 3.22/3.7Cr

Nellore: 2.31/1.8Cr(లాభంతో) 

AP-TG Total:- 52.90CR/45.5Cr(లాభంతో)  

3 ఏరియాలు మాత్రమే రికవరీ అవ్వగా లాంగ్ రన్ లో మరి కొన్ని ఏరియాలు రికవరీ అయ్యే అవకాశం ఉండగా కొన్ని ఏరియాలు మాత్రం ఎఫెక్ట్ అయ్యేలానే ఉన్నాయి అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాలలో 45.5 కోట్ల బిజినెస్ మీద 7.4 కోట్లు అధికంగా వసూల్ చేసినప్పటికీ కూడా కొన్ని ఏరియాలు దెబ్బ పడటం ప్రస్తుతం ఆంధ్రలో ఉన్న పరిస్థితులకు నిదర్శనం అని చెప్పాలి. అందుకే అన్ని సినిమాల మేకర్స్ టికెట్ హైక్స్ కోసం ట్రై చేస్తున్నారు కానీ కుదరడం లేదు. పెద్ద హీరోలు మరియు భారీ బడ్జెట్ చిత్రాలను లక్ష్యంగా చేసుకునే ఉద్దేశ్యంతో AP లో వైసీపీ ప్రభుత్వం యొక్క G.O కి వ్యతిరేకంగా అటు హీరోలు, ఇటు నిర్మాతలు సంప్రదిపులు చేస్తూనే వున్నారు. చూడాలి.. వైసీపీ ప్రభుత్వం అఖండ వసూళ్లు అడ్డుకోవటంతో కొంత విజయం సాధించినా.. మిగిలిన సినిమాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందో అనేదే ప్రశ్న.

Akhanda Collections:

Akhanda Movie Total Collections
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs