Advertisement
Google Ads BL

బంగార్రాజులో జాతిరత్నాలు భామ ఐటెం సాంగ్


నాగార్జున - నాగ చైతన్య కలయికలో ఫామిలీ మల్టీస్టారర్ అంటూ కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు మూవీ షూటింగ్ ని పరుగులు పెట్టించడమే కాదు.. ఆ సినిమా ప్రమోషన్స్ ని టీం అగ్రెసివ్ గా.. సంక్రాంతి టార్గెట్ గా ముందుకు తీసుకువెళుతుంది. సంక్రాంతి అంటే జనవరి 15 న నాగార్జున బంగార్రాజు మూవీని రిలీజ్ చేసేందుకు కంకణం కట్టుకున్నాడని.. అందుకు అనుగుణంగానే  షూటింగ్ ని కళ్యాణ్ కృష్ణ కంప్లీట్ చేస్తూ.. మధ్య మధ్యలో ప్రమోషన్స్ ని చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో నాగార్జున కి జోడిగా రమ్యకృష్ణ, నాగ చైతన్యకి జోడిగా నాగలక్ష్మి పాత్రలో కృతి శెట్టి నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన నాగ్, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి లుక్స్ హైలెట్ అనేలా ఉన్నాయి.

Advertisement
CJ Advs

ఇక ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ గజ్జర్ ఐటెం సాంగ్ చేస్తుంది అనే టాక్ ఉండగా.. స్వర్గలోకంలో తండ్రి కొడుకులతో కలిసి ఆడేందుకు జాతి రత్నాల ఫేమ్ ఫయారా అబ్దుల్లా వచ్చినట్లుగా టీం అప్ డేట్ ఇచ్చింది. ది పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌తో నాగ్ అండ్ నాగ చైతన్యలు ఫారియా అబ్దుల్లాతో కలిసి వస్తున్నారు. మూడవ సింగిల్ డిసెంబర్ 17న విడుదల కానుంది. ప్రస్తుతం వదిలిన బంగార్రాకు మూడో సింగిల్ ఓయ్ బంగార్రాజు నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోతే.. ప్రోమోలో ఫరియా అబ్దుల్లాతో కలిసి అక్కినేని తండ్రీకొడుకులు డ్యాన్స్ చేస్తున్నారు. నాగ్ పంచె కట్టులో కనిపిస్తుండగా, నాగ చైతన్య రంగురంగుల దుస్తులు ధరించాడు. ఇక ఐటెం గర్ల్ ఫారియా ఈ సాంగ్ లో అటామ్ బాంబ్ లాగా కనిపిస్తుంది.. ఈ మాస్ ఐటెం బంగార్రాజు ఆల్బమ్స్ లో హైలెట్ అనేలా ఉంటుంది అంటున్నారు.

Bangarraju teases with Fiara Abdullah party song:

<span>Bangarraju teases with the party song of the year</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs