Advertisement
Google Ads BL

సమంతకి స్వల్ప అస్వస్థత


నాగ చైతన్య ని ప్రేమించి పెళ్ళాడి, నాలుగేళ్లు కలిసి జీవించిన సమంత.. ఈమధ్యనే నాగ చైతన్య నుండి విడాకులు తీసుకుని సింగిల్ స్టేటస్ గా మారింది. చైతు తో విడాకుల తర్వాత కెరీర్ లో దూసుకుపోతున్న సమంత.. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్  కి బోలెడన్ని అవార్డులు అందుకుంటుంది. మరోపక్క అల్లు అర్జున్ తో కలిసి పుష్ప సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ చేసింది.. ఊ అంటావా మావ.. ఉ ఊ అంటావా మావ అంటూ హాట్ గా అదరగొట్టేసింది. ఇక హీరోయిన్ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సమంత.. హైదరాబాద్ లోని ఓ ప్రెవేట్ ఆసుపత్రికి వెళ్లడం చర్చనీయాంశం అయ్యింది.

Advertisement
CJ Advs

సమంత మొన్న తిరుమల శ్రీవారిని దర్శించుకుని, నిన్న ఆదివారం కడప దర్గాని దర్శించుకుని వచ్చిన.. కొద్ది గంటలకే జలుబు, వైరల్ ఫీవర్ రావాడంతో.. సమంత నిన్న ఆదివారం హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్ళింది. సమంత ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ లు చేయించుకోవడం ఆమె అభిమానులని అందోళనకు గురి చేసింది. అయితే సమంత ఆరోగ్యం బాగానే ఉంది అని, జలుబు, దగ్గు రావడంతో సమంత ఏఐజీ హాస్పిటల్ కి వెళ్లి కొన్ని టెస్ట్స్ చేయించుకుని వేంటనే ఇంటికి వెళ్లిపోయారని, ప్రస్తుతం ఆమె ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారని, సోషల్ మీడియాలో సమంత పై వస్తున్న వార్తలను నమ్మవద్దు అంటూ సమంత మేనేజర్ మధు మీడియాకి సమాచారం అందించారు.

Samantha Suffering from Cold and Viral Fever:

Samantha Health Update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs