Advertisement
Google Ads BL

ఆ విషయంలో పుష్ప టీం టెంక్షన్


అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప రిలీజ్ కి సిద్ధంగా ఉంది. డిసెంబర్ 17 న రిలీజ్ కాబోతున్న పుష్ప పై అన్ని భాషల్లో మంచి అంచనాలున్నాయి. అయితే రిలీజ్ కి దగ్గరయ్యే కొలది పుష్ప టీం లో టెంక్షన్ పెరిగిపోతుంది. కారణం ప్రమోషన్స్ వీక్ గా ఉండడమే. నిన్నమొన్నటివరకు, సాంగ్ షూట్, డబ్బింగ్ అంటూ రాత్రీపగలూ తిరిగిన టీం కి ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలో కంగారు పుడుతుంది. తెలుగు, తమిళంలో, అలాగే కన్నడ ఆఖరికి మలయాళంలోనూ అల్లు అర్జున్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. కానీ హిందీలోకి అల్లు అర్జున్ ఫస్ట్ టైం అడుగుపెడుతున్నారు. నిన్నమొన్నటివరకు బాలీవుడ్ మీడియాలో అల్లు అర్జున ఆర్టికల్స్ తెగ వచ్చేసేయి. అల్లు అర్జున్ బాలీవుడ్ పీఆర్ టీమ్ పర్ఫెక్ట్ గా పని చేసేది.

Advertisement
CJ Advs

కానీ రిలీజ్ కి మరో ఐదు రోజులు టైం మాత్రమే ఉన్న పుష్ప సినిమా గురించిన ఆర్టికల్స్ బాలీవుడ్ మీడియాలో కానీ, వెబ్ మీడియాలో కానీ పెద్దగా కనిపించడం లేదు.. ముంబై లో పుష్ప రిలీజ్ ప్రెస్ మీట్ ప్లాన్ చేస్తోంది. ఇంకెప్పుడు అంటున్నారు ఫాన్స్. ఇక రాజమౌళి కూడా పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీకి ఓ సలహా ఇచ్చారు. పుష్ప సినిమా చాలా మంచి సబ్జెక్ట్ అని ప్రమోషన్స్ ఇంకా గట్టిగా చేయాలి అని అల్లు అర్జున్ కి చెప్పిన రాజమౌళి నీ చేతిలో ఇంత మంచి ప్రోడక్ట్ ఉంది దీనిని అలా ఊరికే వదిలేయ వద్దు(ప్రమోషన్స్ వీక్ అనేగా?దానర్ధం) ఎంత దూరం ప్రమోట్ చేయగలిగితే అంత దూరం ప్రమోట్ చేయాలి అని సలహా ఇచ్చారు. ఇప్పుడు పుష్ప టీం లో అదే కంగారు.. రిలీజ్ కి ఎంతో టైం లేదు.. ఇప్పుడు ప్రమోషన్స్ లో కొత్తదనం ఎలా చూపించాలా అని టెంక్షన్ పడుతున్నారు.

Pushpa team tension in that regard:

Pushpa team gear up for solid promotions across India
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs