Advertisement
Google Ads BL

అందుకే సుక్కు పుష్ప ఈవెంట్ లో మిస్


గత రాత్రి అంటే ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో అల్లు అర్జున్ - సుకుమార్ కాంబో పుష్ప ప్రీ రీలీజ్ ఈవెంట్ భారీ లెవల్లో జరిగింది. అల్లు అర్జున్ స్టైలిష్ గా హాజరవగా.. రష్మిక గ్లామర్ గా హాజరైంది. ఇక ఈ ఈవెంట్ కి కొరటాల, రాజమౌళి చీఫ్ గెస్ట్ లుగా హాజరయ్యారు. అయితే పుష్ప సినిమాకి మెయిన్ పిల్లర్ అయిన దర్శకుడు సుకుమార్ ఈ ఈవెంట్ లో మిస్ అయ్యారు. కొరటాల శివ, రాజమౌళి ఎంతగా కవర్ చేసినా ఆయన లేని పుష్ప ఈవెంట్ లో కనబడింది.. ఆఖరికి స్టేజ్ పై సుకుమార్ కూతురు బన్నీ మావా అంటూ మాట్లాడినా.. ఈ ఈవెంట్ కి మెయిన్ పిల్లర్ లేకపోవడం లోటుగా ఉండిపోయింది.

Advertisement
CJ Advs

అయితే సుకుమార్ పుష్ప ఈవెంట్ కి రాలేకపోవడానికి ముఖమైన కారణం ఆయన ముంబై వెళ్లి అక్కడ పుష్పకి సంబందించిన పనులు చక్కబెట్టుకోవడమేనట. పుష్పను మరింత అద్భుతంగా చూపించేందుకు అవసరమైన పనుల కోసం సుకుమార్ ముంబయి వెళ్లారని గెస్ట్ గా వచ్చిన రాజమౌళి స్టేజ్ పై చెప్పారు. సుకుమార్ మూవీస్ అంటే తనకి చాలా ఇష్టమన్న రాజమౌళి.. పుష్ప రిలీజ్ టైం దగ్గర పడడంతో.. ప్రమోషన్స్ కి టైం సరిపోవడం లేదని సుకుమార్ తనతో చెప్పారని.. దానికి నేని.. కష్టపడి పనిచేస్తే జరగాల్సింది జరుగుతుంది అని ప్రోత్సహించానని పుష్ప స్టేజ్ పై సుక్కు లేని లోటు తీర్చేందుకు రాజమౌళి ట్రై చేసారు. పుష్ప కోసం సుకుమార్ మాత్రం డే అండ్ నైట్ కష్టపడడం అనేది మాత్రం అందరికి ఇప్పుడు పూర్తిగా అర్ధమవుతుంది. 

Why Sukumar Skips Pushpa Pre-Release Event:

The reason why Sukumar did not come to the Pushpa event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs