Advertisement
Google Ads BL

చప్పుడు లేని భీమ్లా నాయక్


ప్రస్తుతం ఇంటా బయట అన్నట్టుగా.. సోషల్ మీడియాలోను, మీడియాలోనూ బయట కూడా రేపు శుక్రవారం విడుదల కాబోయే పుష్ప మూవీ గురించి అలాగే జనవరి 7 న రిలీజ్ కాబోతున్న ఆర్.ఆర్.ఆర్ గురించే మాట్లాడుకుంటున్నారు. పుష్ప ప్రమోషన్స్ తో రెచ్చిపోతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ హైదరాబాద్ లో అదిరిపోయే ఫంక్షన్ చేసిన అల్లు అర్జున్ అండ్ టీం.. అటు ఛానల్స్ ఇంటర్వూస్ అంటూ ఫాన్స్ కి మంచి జోష్ ఇస్తుంటే.. ఆర్.ఆర్.ఆర్ టీం అందులోనూ హీరోలు.. పాన్ ఇండియా లెవల్లో విడుదలవుతున్న సినిమాని ఆయా భాషల్లో తెగ ప్రమోట్ చేస్తూ అందరూ ఆర్.ఆర్.ఆర్ గురించే మాట్లాడేలా చేసారు. మరి సంక్రాంతికి విడుదలకబోతున్న పవన్ కళ్యాణ్ - రానా క్రేజీ మల్టీస్టారర్ ముచ్చట్లు సోషల్ మీడియాలో వినిపించడం లేదు. మొన్న భీమ్లా నాయక్ నుండి సాంగ్ రిలీజ్ అయ్యింది. తర్వాత చప్పుడు చెయ్యడం లేదు.

Advertisement
CJ Advs

అటు చూస్తే పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మరి భీమ్లా నాయక్ షూటింగ్ కంప్లీట్ అయ్యిందా.. లేదంటే అంటూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఆరా లాగుతున్నారు. భీమ్లా నాయక్ ఏదో ఒక అప్ డేట్ తో వచ్చేనెల 12 వరకు సోషల్ మీడియాలో ట్రెండ్ అయితే.. అంచనాలకు మించి సినిమా హిట్ అవ్వుద్ది అని ఫాన్స్ ఆరాటం.. కానీ భీమ్లా నాయక్ మేకర్స్ సైలెంట్ గా ఉండడం చూస్తే అటు పవన్ ఫాన్స్ కూడా టెంక్షన్ పడుతున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రస్తుతం పుష్ప.. ఎప్పుడో విడుదల కాబోయే ఆర్.ఆర్.ఆర్ క్రేజ్ చూస్తే పవన్ ఫాన్స్ కి ఆత్రం పెరిగిపోతుంది. మధ్యలో భీమ్లా నాయక్ అప్ డేట్ ఇస్తే.. ఆర్.ఆర్.ఆర్, పుష్ప క్రేజ్ ని పడుకోబెట్టేయ్యొచ్చని వాళ్ళ తాపత్రయం.. కానీ భీమ్లా నాయక్ చప్పుడు చెయ్యకుండా సైలెంట్ గా కూర్చుంది. 

Bhimla Nayak making no sound:

Bhimla Nayak update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs