Advertisement
Google Ads BL

బన్నీ పుష్పాకి ఇంటర్నేషనల్ పబ్లిసిటీ


అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప పాన్ ఇండియా మూవీ ప్రభంజనం స్టార్ట్ అయ్యింది. డిసెంబర్ 17 న రిలీజ్ కి రెడీ అయిన సినిమాపై భారీ అంచనాలున్నాయి. అల్లు అర్జున్ మాసివ్ లుక్, డీ గ్లామర్ లుక్స్, పుష్పాలోని పాత్రల తీరు అన్ని సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఈ రోజు డిసెంబర్ 12 న హైదరాబాద్ లో యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్ లో పుష్ప మాసివ్ ప్రీ రిలీజ్ పార్టీ అంటూ హడావిడి చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ సైలెంట్ గా ప్రమోషన్స్ మొదలు పెట్టి.. తెలుగు, తమిళ్ కి కలిపి ఛానల్ ఇంటర్వ్యూ లలో పాల్గొంటున్నారు. అయితే ఇప్పుడు పుష్ప అల్లు అర్జున్ సినిమాకి ఇంటర్ నేషనల్ లెవల్లో పబ్లిసిటీ జరుగుతుంది. 

Advertisement
CJ Advs

ఇంటర్నేషనల్ లెవల్లో అంటే.. అల్లు అర్జున్ సాంగ్స్ ని కొన్నాళ్లుగా టాప్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్టెప్స్ వేస్తూ.. పబ్లిసిటీ చేస్తూ అల్లు అర్జున్ ఫాన్స్ కి సర్ ప్రైజ్ చేస్తున్నారు. క్యాండీ వార్నర్‌తో కలిసి బుట్టబొమ్మ సాంగ్ కి అదిరిపోయే స్టెప్స్ వేసిన డేవిడ్ వార్నర్ ఇప్పుడు మళ్లీ తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్‌ పుష్ప లోని యే బిడ్దా.. ఇది నా అడ్డా అనే సాంగ్ ని ఇమిటేట్ చేస్తూ ఇంస్టాలో పోస్ట్ చేసాడు. అంతేకాకుండా దీనికో క్యాప్షన్ పెట్టమని అడిగాడు.. దానితో ప్రముఖ క్రికెటర్ వైరల్ కొహ్లీ. నువ్వు ఓకే నా! అని కామెంట్‌ చేసాడు.. దానికి వార్నర్ సరదాగా.. కాస్త గొంతు పట్టేసినట్టుంది అన్నాడు.. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే మై బ్రదర్‌ వార్నర్‌.. తగ్గేదేలే అంటూ కామెంట్ చెయ్యడం.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దానితో పుష్ప సినిమాకి ఇంటర్నేషనల్ పబ్లిసిటీ అంటూ అల్లు అర్జున్ ఫాన్స్ ఖుషి ఫీలవుతున్నారు. 

Warner surprises as Pushpa Raj in Pushpa:

Star cricketer shows Pushpa power
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs