Advertisement
Google Ads BL

ప్రకాష్ రాజ్ అండ్ కో రాజీనామాలు ఆమోదం


మా అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ - మంచి విష్ణు ప్యానల్స్ ఢీ అంటే ఢీ అన్నాయి. మా ఎన్నికల్లో గట్టిగా పోటీ పడిన మంచు విష్ణు మా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకోవడమే కాకుండా.. ప్యానల్ మెంబెర్స్ ని గెలిపించుకుని మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసే లోపే.. మా అధ్యక్ష పీఠానికి పోటీ చేసి తన ప్యానల్ ని గెలిపించుకోలేకపోయిన ప్రకాష్ రాజ్ అండ్ కో.. మా సభ్యత్వంనికి రాజీనామాలు చేసారు. మా ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ అవకతవకలకు పాల్పడిట్లుగా ఆరోపణలు చేస్తూ మా సభ్యత్వానికి రాజీనామా చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

Advertisement
CJ Advs

కానీ మంచు విష్ణు మాత్రం ప్రస్తుతం వాళ్ళ రాజీనామాలు అంగీకరించేది లేదని.. వాళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడి.. వాళ్ళని శాంతింప జేస్తాను అని మీడియా ముఖంగా చెప్పి నెలరోజులు పైనే అయ్యింది. అయితే తాజాగా మా ప్రెసిడెంట్ విష్ణు, ప్రకాష్ రాజ్ అండ్ టీం రాజీనామా లను ఆమోదించినట్లుగా తెలుస్తుంది. దాదాపుగా నెల రోజుల పాటు తమ రాజీనామా నిర్ణయాన్ని అందరూ వెనక్కి తీసుకోవటానికి మంచు విష్ణు ప్రయత్నం చేసినప్పటికీ.. వాళ్ళు అంగీకరించకపోవడంతో... వాళ్ళ రాజీనామాలను ఆమోదించినట్లుగా తెలుస్తుంది. ఇక మా అధ్యక్షడు మంచు విష్ణు మా అసోసియేషన్ వర్క్స్ కోసం వారి స్థానంలో కొత్త సభ్యులను తీసుకున్నాను. అయితే వారు మా సభ్యులుగా కొనసాగుతారు. నాగబాబు, ప్రకాష్ రాజు కూడా మా సభ్యులుగా కొనసాగుతారు అని చెప్పారు.

Manchu Vishnu accepts Prakash Raj panel resignations:

<span>Shocker: MAA President Manchu Vishnu springs a surprise</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs