Advertisement
Google Ads BL

నిన్న ప్రభాస్.. నేడు మహేష్


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ఆయన ఒప్పుకున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చూస్తే అర్ధమవుతుంది. ముంబై, హైదరాబాద్ అంటూ ప్రభాస్ ఎక్కే ఫ్లైట్ ఎక్కడం, దిగే ఫైట్ దిగడం అంటూ అదరగొట్టేస్తున్నాడు. అలాంటి ప్రభాస్ ఇప్పుడు హైదరాబాద్ లో నానక్ రామ్ గూడలో ఓ పోర్ష్ గెస్ట్ హౌస్ గెస్ట్ కట్టించుకుంటున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. కొన్ని కోట్ల ఖర్చుతో ప్రభాస్ అధునాతన పద్దతిలో ఆ హౌస్ నిర్మాణం చేపట్టినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ ఇంటి గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు.

Advertisement
CJ Advs

ఇలాంటి సమయంలో మహేష్ బాబు హైదరాబాద్ లోని పోర్ష్ ఏరియా అయిన జూబ్లీహిల్స్ లో 1400 గజాల స్థలాన్ని 26 కోట్లతో కొనుగోలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. 1442 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్ కోసం మహేష్ బాబు దాని రిజిస్టేషన్ కి 39 లక్షలు మరియు స్టాంప్ డ్యూటీకి 1.43 కోట్లు చెల్లించినట్లు బయటకు వస్తోంది. యర్రం విక్రాంత్ రెడ్డి నుండి మహేష్ బాబు ఈ ప్లాట్‌ను కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ప్రభాస్ కడుతున్న ఆ ఇంటి గురించి, మహేష్ కొన్న స్థలం ముచ్చట్లే సోషల్ మీడియాలో నడుస్తున్నాయి.

Yesterday Prabhas, today Mahesh:

<span>Mahesh Babu buys a plot worth crores</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs