బాలకృష్ణ ప్రస్తుతం అఖండ మూవీ సక్సెస్ జోష్ లో ఉన్నారు. అటు అఖండ హిట్టు.. ఇటు NBK107 మూవీ షూట్ కి రెడీ అవుతున్నారు. అలాగే ఆహా ఓటిటి కోసం అన్ స్టాపబుల్ అంటూ టాక్ షో తో అదరగొట్టేస్తున్నారు. బాలకృష్ణ ఇప్పటికే మోహన్ బాబు, హీరో నాని, బ్రహ్మానందం లతో ఆహా అన్ స్టాపబుల్ షో చేసారు.. మూడు ఎపిసోడ్స్ సూపర్ హిట్ అయ్యాయి.. ఇక నాలుగో ఎపిసోడ్ కి అఖండ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ఉన్న అఖండ టీం పాల్గొంది. అందులో ముఖ్యంగా శ్రీకాంత్ పాల్గొనగా.. శ్రీకాంత్ కెరీర్ గురించిన ప్రశ్నలు అడిగారు బాలయ్య. ఇక వెన్నుపోటు అంటూ నాన్నగారి విషయంలో పదే పదే మాట్లాడుతూ.. బాధపెడుతున్నారు. అయన మా బావగారు, ఈయన మా నాన్నగారు. నాన్నగారికి ఆయన సంపాదనతోనే ఆయన ఏమైనా కొనుక్కోవడం, ఆయనకు ఇష్టం వచ్చినట్టుగా ఉండడం నచ్చుతుంది. వెన్నుపోటు అంటే పార్టీని కాపాడుకోవడానికి చెయ్యాలి.. నేను ఆయన కొడుకుని ముఖ్యంగా ఆయన అభిమానిని.. అయినా రాజకీయాల గురించి ఇప్పుడెందుకు అన్నారు బాలయ్య.
తర్వాత ఆ టాక్ షో లోకి బోయపాటి అన్ స్టాపబుల్ అంటూ ఎంటర్ అయ్యారు. ఇక బోయపాటి తో మాట్లాడుతూ.. అఖండ విజయానికి కారణం ఎవరు అనగానే.. మీరు నేను అన్నాడు బోయపాటి. ఆతర్వాత అక్కడికి థమన్, హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ కూడా వచ్చారు. శ్రీకాంత్, బోయపాటి ఆటలో శ్రీకాంత్ బోయపాటి గారు.. మీరు బాలయ్య బాబు తో సీక్వెల్ తియ్యాలి అంటే ఏ సినిమా చేస్తారని అడగగానే.. ఏ సినిమా ఏంటి.. సింహ 2 తీస్తాను, లెజెండ్ 2 తీస్తాను, అఖండ 2 తీస్తాను.. బాలయ్య బాబు తో ఏదైనా సీక్వెల్ తియ్యగలను అన్నాడు బోయపాటి. ఇక ప్రగ్య జైస్వాల్, థమన్ మధ్యలో గేమ్ పెట్టిన బాలయ్య ఆ గేమ్ లో చిన్న పిల్లాడిగా గెంతులు వెయ్యడం షో కి హైలెట్ గా నిలిచింది. ఇక జై బాలయ్య సాంగ్ కి బాలకృష్ణ - ప్రగ్య జైస్వాల్ లు అన్ స్టాపబుల్ స్టేజ్ పై కాలు కదపడం ఈ ఎపిసోడ్ కి మరింత హైలెట్ అయ్యింది.