Advertisement
Google Ads BL

250 కోట్లతో పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ త‌గ్గేదేలె


అల్లు అర్జున్ కి అల వైకుంఠ‌పురంలో వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌రువాత సుకుమార్ దర్శకత్వంలో ఆయన చేసిన పుష్ప ది రైజ్ పాన్ ఇండియా మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఐదు భాషల్లో డిసెంబర్ 17 న రిలీజ్ కాబోతున్న పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుంది. అటు సుకుమార్ కూడా రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పుష్ప ది రైజ్ తో ప్రేక్షకుల ముందుకు రావడం, అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావ‌డంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలున్నాయి. ఆ అంచనాలతోనే భారీ ధ‌ర‌ల‌కు పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ లెవల్లో జరిగింది.

Advertisement
CJ Advs

ఇప్పటికే చాలా ఏరియాలలో పుష్ప ది రైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ కి ఫ్యాన్సీ రేట్లు వచ్చాయి. మరోపక్క ట్రేడ్ లోను అనూహ్య స్పంద‌న‌ ఏర్పడింది.  తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాలం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో థియేట్రిక‌ల్ అలానే నాన్ థియేట్రిక‌ల్ (ఓటిటి, డిజిటిల్ రైట్స్) క‌లుపుకొని 250 కోట్లు రిలీజ్ కి ముందే బిజినెస్ దక్కించుకుంది పుష్ప ది రైజ్. ఫస్ట్ టైం  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పాన్ ఇండియా సినిమా చేస్తుండ‌టంతో పుష్ప ది రైజ్ పై సినిమా బిజినెస్ వ‌ర్గాల్లో విపరీతమైన ఆస‌క్తి పెరిగి.. ప్రీ రిలీజ్ బిజినెస్ లో పుష్ప ది రైజ్ - త‌గ్గేదేలె అంటూ అంచనాలు అమాంతం పెంచేసింది.  

 

Pushpa The Rise Pre-Release Business Touched The 250 Crore Mark:

Icon Star Allu Arjun Pan India Movie Pushpa The Rise Pre-Release Business Touched The 250 Crore Mark
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs