నిన్న శుక్రవారం రాత్రి ఎపిసోడ్ లో బిగ్ బాస్ లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్స్ ముసుగులని బుల్లితెర ప్రేక్షకులు ఆల్మోస్ట్ తీసేసారు. వారు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న శ్రీరామ్, షణ్ముఖ్, సిరి, మానస్, సన్నీ, కాజల్ లకి ఆడియన్స్ ఏమనుకుంటున్నారో.. అనేది లేటర్స్ రాసి ఇవ్వడం తో వాటిని బిగ్ బాస్ స్క్రీన్ మీద వేసి చూపించారు.. కాజల్ - సన్నీ - మానస్ లను, శ్రీరామ్ అయితే షణ్ముఖ్ గ్రూప్ లో చేరాడని డైరెక్ట్ గా అడిగేసారు. సన్నీ ని గిల్టీ బోర్టు వేసుకున్నప్పుడు ఎలా ఫీలయ్యారు అని రాసారు.. దానికి సన్నీ సమాధానం ఇచ్చాడు. మానస్ ని కూడా సన్నీ మిమ్మల్ని ఫ్రెండ్ షిప్ ముసుగులో వాడుకుంటున్నాడు అన్నారు.
ఇక సిరి ని మీరెందుకు ఇలా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారు, షణ్ముఖ్ కన్నా మీరే స్ట్రాంగ్ ప్లేయర్ అన్నారు. ఇక షణ్ముఖ్ కి డైరెక్ట్ క్వచ్చన్ వేశారు.. అది సిరిని మీరు కంట్రోల్ చేస్తారు అనే ప్రశ్నకి షణ్ముఖ్ లేచి.. అవును సిరిని కంట్రోల్ చేస్తాను.. కాకపోతే గేమ్ లో కాదు.. ఆమెని ఎక్కడ కంట్రోల్ చెయ్యాలి, ఎక్కడ వదిలెయ్యాలనే కన్ఫ్యూజన్ లో అలా జరుగుతుంది.. అదే కన్ఫ్యూజన్ లో అరవడం కూడా జరుగుతుంది అన్నాడు. తర్వాత ఆడియన్స్ ని జేడ్జ్ చేస్తున్నారు.. ఇదెలా వెళుతుంది, ఈ కంటెంట్ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు.. అని షణ్ముఖ్ ఎందుకిలా ఆలోచిస్తున్నారు అంటూ పేరు రాయని ఓ ఆడియన్స్ ప్రశ్న. ఇక శ్రీరామ్ కూడా షణ్ముఖ్ ని అడిగాడు.. సిరిని కంట్రోల్ చేస్తావా అని.. చేస్తాను అన్నాడు.. సిరి మాత్రం టాస్క్ లో కంట్రోల్ అవ్వను, మిగతా విషయాల్లో కంట్రోల్ గానే ఉంటాను అంది.
ఇక మానస్ కి ప్రియాంక పై ప్రశ్న కూడా వచ్చింది. దానికి మానస్ సమాధానం చెప్పాడు.