రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ మూవీ ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చెయ్యబోతున్నారు. పాన్ ఇండియా రిలీజ్ లో భాగంగా ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్స్ ని ఆయా భాషల్లో ముఖ్యమైన సిటీస్ లో పెడుతూ.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నారు. నిన్న గురువారం ముంబై లో ఆర్.ఆర్.ఆర్ టీం మొత్తం కలిసి ట్రైలర్ లాంచ్ చేసారు. ఇక హైదరాబాద్ లో గురువారం జరగాల్సిన ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ అవ్వగా.. ఈ రోజు శుక్రవారం బెంగుళూర్ లో తారక్, రామ్ చరణ్, రాజమౌళి, దానయ్య, అలియా భట్ లు కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ రోజు సాయంత్రం చెన్నై లో ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఇక బెంగుళూర్ ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్ లో హీరోస్ తారక్ అండ్ రామ్ చరణ్ లు ఫన్నీ సమాధానాలతో నవ్వించగా.. రాజమౌళి మాత్రం బాహుబలిని కన్నడలో రిలీజ్ చెయ్యకపోవడం వలన కన్నడ ప్రేక్షకులతో తిట్లు తిన్నానని అన్నారు.. అందుకే ఆర్.ఆర్.ఆర్ ని క్రేజీగా కన్నడలో రిలీజ్ చేస్తున్నట్లుగా చెప్పారు.
ఆర్.ఆర్.ఆర్ బెంగుళూర్ ప్రెస్ మీట్ హైలైట్స్
ఎన్టీఆర్ మాట్లాడుతూ.. మా అమ్మగారు కన్నడ వారు.. కాబట్టి కన్నడలో డబ్బింగ్ చెప్పేటప్పుడు జాగ్రత్తలు చెప్పారని, అలాగే తన ఫ్రెండ్ పునీత్ మరణం మరిచిపోలేకపోతున్నాను అంటూ పునీత్ కోసం గతంలో తాను పాడిన పాటని స్టేజ్ పై పాడడమే కాదు.. ఇదే లాస్ట్ అన్నారు. ఇక రామ్ చరణ్ ని రాజమౌళి ఎప్పడికైనా టార్చర్ పెట్టారా.. అనగా లేదండి అన్న వెంటనే తారక్ మైక్ తీసుకుని ఎస్ పెట్టారండి అన్నాడు. అదేమిటి అనగానే.. ఆయనకి పర్ఫెక్షన్ ఇంపార్టెంట్.. సీన్ కరెక్ట్ గా రావడానికి టేక్స్ మీద టేక్స్ తీసుకుంటారని చెప్పాడు. ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ... ఇక్కడ కోవిడ్ నిభందనలు ఉన్న కారణంగా.. ఉక్రెయిన్ షూటింగ్ కి తీసుకెళ్లి.. ఉక్రెయిన్ లో 11 రోజులు రిహార్సల్స్ చేయించి 12 వ రోజున షూట్ కి వెళ్ళాం.. రిహార్సల్స్ కోసం వేరే దేశం వెళ్ళినాయన రాజమౌళి గారే అన్నాడు.
ఇక అలియా భట్ మాత్రం రాజమౌళి గారితో వర్క్ చెయ్యడం హ్యాపీగా వుంది అనగానే ఆవిడకి హ్యాపీ గా ఉందేమో.. మాకు మాత్రం దూల తీరిపోయింది అన్నాడు ఎన్టీఆర్. ఏం మీరు నాటు నాటు సాంగ్ కి వచ్చిన రెస్పాన్స్ కి హ్యాపీ గా ఉన్నారా.. లేదా.. అని రాజమౌళి ఎన్టీఆర్ అండ్ చరణ్ ని అడగ్గానే.. ఎందుకు లేము అన్నారు.. మరి అలాంటప్పుడు టార్చర్ అనకూడదు అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు రాజమౌళి.
ఇక రాజమౌళిని మీడియా వాళ్ళు మీ సక్సెస్ మంత్రం ఏమిటి చెప్పమనగానే.. నేనెప్పుడూ సక్సెస్ సాధించానని భావించను. నేను చేసే ప్రతి సినిమాని నా మొదటి ప్రాజెక్ట్‌లానే అనుకుంటాను. నేను ఏదైతే కథ అనుకుంటానో దానికి సరిపడా నటీనటులను ఎంచుకోవడమే నా బలం అని భావిస్తుంటాను అంటూ చెప్పుకొచ్చారు.