Advertisement
Google Ads BL

పెళ్లి అని చెప్పలేదు.. కానీ ఇప్పుడు మాత్రం


బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ లు పెళ్లి తో నిన్న రాజస్థాన్ ఫోర్ట్ లో ఒక్కటయ్యారు. కత్రినా - విక్కీ కౌశల్ లు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. ఎక్కడా వారి ప్రేమని బయటపెట్టలేదు.. విక్కీ కౌశల్ చాలాసార్లు కత్రినా ఇంటి దగ్గర మీడియాకి దొరికిపోయాడు.. ఒక్క సినిమాలో కూడా కలిసి నటించని విక్కీ - కత్రినా కైఫ్ ల ప్రేమ పై బోలెడన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. గత రెండు నెలలుగా కత్రినా - విక్కీ కౌశల్ ల పెళ్లి విషయంలో బాలీవుడ్ మీడియాలోనే చక్కర్లు కొడుతోంది. విక్కీ కి - కత్రినాకి ఎంగేజ్మెంట్ అయ్యింది అని మీడియాలో వార్తలొచ్చినా ఈ జంట స్పందించలేదు.

Advertisement
CJ Advs

ఇక గత వారం రోజులుగా వారి పెళ్లి గురించిన ఆర్టికల్స్ మీడియాలో వస్తున్నా, కనీసం మేము పెళ్లి చేసుకోబోతున్నామంటూ వారిద్దరూ ఎక్కడా చెప్పలేదు, ఇక కియారా అద్వానీ, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్స్ మాకు పెళ్ళికి ఆహ్వానం లేదు అని మీడియా ముఖంగానే చెప్పారు. నిన్న డిసెంబర్ 9 న రాజస్థాన్ లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ ల జంట తమ వివాహ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి.. తామిద్దరం పెళ్లి బంధంతో ఒక్కటయ్యాం అని, తమ మధ్యన ఉన్న ప్రేమే.. తమని పెళ్లి దాకా తీసుకు వచ్చింది అని, తమ పెళ్ళికి మీ ఆశీర్వాదం కావాలంటూ ​అభిమానులకి, మీడియాకి, సెలబ్రిటీస్ కి ఒకే ఒక్క ట్వీట్ తో సమాధానం చెప్పేసారు. పెళ్లి బట్టల్లో అందంగా, ఆనందంగా నిండుగా ఉన్న ఈ జంటని నిజంగానే అందరూ ఆశీర్వదించేసారు. అయితే పెళ్లి విషయం చెప్పని ఈ జంట అందరి నుండి ఆశీర్వాదం మాత్రం కోరుకుంటుంది అంటూ నెటిజెన్స్ సెటైర్స్ చేస్తున్నారు

Katrina Kaif shares photos from wedding with Vicky Kaushal: Only love and gratitude in our hearts:

Katrina Kaif and Vicky Kaushal are now wife and husband
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs