Advertisement
Google Ads BL

బాలీవుడ్ ప్రేక్షకులని అలా పడేసాడు


రామ్ చరణ్ అంటే జంజీర్ తో బాలీవుడ్ లో బోణి కొట్టాడు.. అంటే ఆర్.ఆర్.ఆర్ తో రామ్ చరణ్ ని ప్రత్యేకంగా బాలీవుడ్ కి పరిచయం చెయ్యక్కర్లేదు.. అందులోనూ అక్కడ బడా స్టార్ హీరోస్ సల్మాన్ ఖాన్ లాంటి ఫ్రెండ్స్ ఉండనే ఉన్నారు. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మాత్రం బాలీవుడ్ కొత్తే.. ఆర్.ఆర్.ఆర్ తోనే ఎన్టీఆర్ హిందీకి పరిచయం అవుతున్నాడు.. కాబట్టి అక్కడి ప్రేక్షకులని ఎలా బుట్టలో వెయ్యాలో ఎన్టీఆర్ కనిపెట్టేసాడు. అందుకే రీసెంట్ గా ముంబై లో జరిగిన ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఒద్దిక, మాట్లాడిన తీరుకి చూసి బాలీవుడ్ మీడియానే కాదు.. అక్కడి ప్రేక్షకులు పడిపోయారంటే మనోడు ఎంత మాయ చేసి ఉండాలి.

Advertisement
CJ Advs

రాజమౌళి, అజయ్ దేవగన్, అలియా భట్ లతో కలిసి స్టేజ్ మీద నిలుచున్న ఎన్టీఆర్.. ఆర్.ఆర్.ఆర్ గురించి అజయ్ దేవగన్ గురించి మాట్లాడిన మాటలకి ఎవ్వరైనా పడిపోవాల్సిందే. దేశంలోని ఇంత పెద్ద స్టార్స్ తో నటించడం ఒక కల అంటూ ఎన్టీఆర్ చెప్పడం చూసిన హిందీ ప్రేక్షకులు ఎన్టీఆర్ ని పొగిడేస్తున్నారు. అజయ్ దేవగన్ తో తనని పోల్చవద్దని, దేవగన్ ముందు తామింకా చిన్నవాళ్ళమే అని, అజయ్ దేవగన్ తో వర్క్ చెయ్యడం అంటే.. ఓ గురువుతో పని చేసినట్టే అని, ఆయనతో కలిసి ఇలా ఆర్.ఆర్.ఆర్ లో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన అదృష్టమంటూ చెప్పి.. బాలీవుడ్ ప్రేక్షకులని పడేసాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలని బాలీవుడ్ మీడియా తెగ హైలెట్ చేసింది.. మరి రామ్ చరణ్ మిస్ అయిన లోటుని ఎన్టీఆర్ అలా మాట్లాడి పూడ్చేసాడు.

Working with Ajay Devgn sir was like working with a Guru: Jr NTR:

Working with him was like working with a guru: Jr NTR on Ajay Devgan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs