Advertisement
Google Ads BL

కత్రినా-విక్కీ కౌశల్ పెళ్లి: ఖర్చు విషయంలో ట్విస్ట్


బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ లు రాజస్థాన్‌లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌లో అదిరిపోయే రేంజ్ లో, నలుగురు చెప్పుకునే విధంగా పెళ్లి చేసుకుంటున్నారు. ఈ పెళ్లి కి కొద్దిమంది అతిధులతో పాటుగా.. బాలీవుడ్ నుండి ఎవరెవరు హాజరయ్యారో అనే విషయంలో అందరూ క్యూరియాసిటీగానే ఉన్నారు. అయితే ఇప్పుడు విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ ల పెళ్లి ఖర్చుల విషయంలో ఓ ట్విస్ట్ బయటికి వచ్చింది. కత్రినా - విక్కీలు అంగరంగ వైభవంగా చేసుకుంటున్న పెళ్ళికి సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ యాజమాన్యం వీరికి గిఫ్ట్ గా అక్కడికి వచ్చేవారికి ఫ్రీ గా ఉండడానికి ఉచిత వసతిని ఏర్పాటు చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది.

Advertisement
CJ Advs

అయితే కరోనా వలన రెండేళ్లుగా పర్యాటక ప్రదేశాలు వెలవెల బోతున్నాయి.. ఇప్పుడు కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ లాంటి సెలబ్రిటీస్ పెళ్లి ద్వారా తమ సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ కి ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది కాబట్టి వారలా చేశారట. ఇక అతిధులని తీసుకువెళ్లడం, తీసుకురావడం, అలాగే భోజనాల ఖర్చులు వీటిన్నటికి కూడా బోలెడంత ఖర్చులు అవ్వగా.. అందులో 75 శాతం ఖర్చులని కత్రినానే స్వయంగా పెట్టుకుందనే న్యూస్ బి టౌన్ లో చక్కర్లు కొడుతోంది. మరి మిగతా అంటే ఆ 25 శాతం ఖర్చులు విక్కీ కౌశల్ పెట్టుకున్నాడేమో అంటున్నారు.. మరి వీరి వివాహవేడుకలకి సంబందించిన ఫొటోస్ ఎప్పుడు బయటికి వస్తాయో అని.. ఫాన్స్ ఆతృతగా తెగ ఎదురు చూస్తున్నారు.  

Katrina Kaif Paying 75% Wedding Expenses:

Katrina Kaif Paying 75% Wedding Expenses: Katrina - Vicky Kaushal wedding
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs