Advertisement
Google Ads BL

అరరే.. రామ్ చరణ్ మిస్ అయ్యాడే..


ఈరోజు డిసెంబర్ 9.. ఎన్టీఆర్ ఫాన్స్, రామ్ చరణ్ ఫాన్స్ కే కాదు.. పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన రోజు.. అది రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోస్ అయిన ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ కోసం.. సాయంత్రం నాలుగు గంటలకు రిలీజ్ చేస్తామన్న ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ ని ఉదయం 11 గంటలకే రిలీజ్ చేసి ఫాన్స్ కి స్వీటెస్ట్ సర్ ప్రైజె ఇచ్చారు మేకర్స్. అయితే ట్రైలర్ ని యూట్యూబ్ లో వదిలినా.. ఈ రోజు ఆర్.ఆర్.ఆర్ టీం అంతా కలిసి ముంబై లో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ ని లాంచ్ చేసారు. బాలీవుడ్ లో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ని ఈ ట్రయిలర్ లాంచ్ తోనే మొదలు పెట్టారు రాజమౌళి.

Advertisement
CJ Advs

ఈ వేడుకకి ముంబై లో ఉన్న అలియా భట్, అజయ్ దేవగన్, హైదరాబాద్ నుండి రాజమౌళి, నిర్మాత దానయ్య, అలాగే ఆర్.ఆర్.ఆర్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో ఆర్.ఆర్.ఆర్ మరో హీరో రామ్ చరణ్ మిస్ అవడం కాస్త అభిమానులని డిస్పాయింట్ చేసింది. ఆర్.ఆర్.ఆర్ ఫ్రేమ్ అంటే.. ఎన్టీఆర్ - రామ్ చరణ్ - రాజమౌళి - అలియా భట్ అంటున్నారు ఫాన్స్. అయితే రామ్ చరణ్ తన మరదలు పెళ్లి వేడుకలతో బిజీగా ఉండి రాలేకపోయారని అంటున్నారు. ముంబై లో ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ లాంచ్ ని ఓ రేంజ్ లో నిర్వహించారు. అలియా భట్ క్యూట్ గా రెడ్ సారీ లో మెరవగా, ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. రాజమౌళి తన మేకింగ్ స్టయిల్ తో మరోసారి హిందీ ప్రేక్షకులని పడేసారు. ఇక ఆ ప్రోగ్రాం కి రామ్ చరణ్ మిస్ అవడమే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. 

ఇక హైదరాబాద్ లోనూ ఈరోజు డిసెంబర్ 9 రాత్రి ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్ జరగనుంది.. మరి ఈ ఈవెంట్ కయినా చరణ్ వస్తాడంటారా అనేది ఫాన్స్ కి వస్తున్న అనుమానం.

Ram Charan misses the RRR trailer launch in Mumbai:

RRR trailer launch event in Mumbai
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs