Advertisement
Google Ads BL

ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్: గూస్ బమ్బ్స్ తెప్పించారు సామి


ఎన్టీఆర్, రామ్ చరణ్ విడివిడిగా నటిస్తేనే.. వాళ్ళ పెరఫార్మెన్స్ కి, వాళ్ళ డాన్స్ స్టయిల్ కి ఫాన్స్ పండగ చేసుకుంటారు. ఎమోషనల్ గా కానీ, రొమాంటిక్ గా ని ఎవరికీ వారే అన్నట్టుగా ఉండే ఈ కొదమ సింహాలు.. ఒకే స్క్రీన్ మీద కలిసి కనబడితే.. అబ్బో ఆ క్రేజ్ ని మాటల్లో వర్ణించడం చాలా కష్టం. దర్శక ధీరుడు రాజమౌళి, రామ్ చరణ్ - ఎన్టీఆర్ లని ఎలా చూపిస్తాడో అనుకున్న వారికీ రీసెంట్ గా విడుదలైన ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ పర్ఫెక్ట్ సమాధానం అనేలా ఉంది. జనవరి 7 న రిలీజ్ కాబోతున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ నుండి ఈ రోజు డిసెంబర్ 9 న ఐదు భాషల్లో ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ ని ఉదయం 11 గంటలకు రీలాస్ చేసిన ఫాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది టీం. మరి ఆర్.ఆర్.ఆర్ లో ఏం కావాలనుకున్నారో, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎలా ఉండాలి అనుకున్నారో, ఎలాంటి యాక్షన్ కావాలనుకున్నారో.. అన్ని ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ లో పుష్కలంగా కనిపించాయి. రాజమౌళి మార్క్ దర్శకత్వం, రామ్ చరణ్ యాక్టింగ్, ఎన్టీఆర్ యాక్టింగ్, అలియా భట్, అజయ్ దేవగన్ కేరెక్టర్స్ అబ్బో ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

Advertisement
CJ Advs

Click Here For: RRR Trailer

ఎన్టీఆర్ పులితో ఫైట్ చేస్తూ పులిలా గాండ్రించిన సీన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. విజువల్ గా చూస్తే అందులోని కిక్ కనబడుతుంది.. ఇక పోలీస్ గా ఉన్న రామ్ చరణ్, కొమరం భీం ఎన్టీఆర్ ఎక్కడ ఎలా కలిసారో? వాళ్ళు ఎందుకు కలవాల్సి వచ్చింది? కొమరం భీం - అల్లూరి శత్రువులని కలిసి ఎలా వేటాడారు.. ఇవన్నీ ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ లో రివీల్ చేసారు. బ్రిడ్జ్ కింద భీం, అల్లూరి లు తాళ్లతో వేలాడుతూ వచ్చి చెయ్యి అందించడం అనేది హైలెట్ అనేలా ఉంది. బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన నేరానికి నిన్ను అరెస్ట్ చేస్తున్నా అన్న అల్లూరి మాటలకి.. ఎన్టీఆర్ ఇచ్చిన ఎక్సప్రెషన్ అదుర్స్. తొంగి తొంగి, నక్కి నక్కి కాదే.. తొక్కుకుంటూ పోవాలి, ఎదురొచ్చినోణ్ని ఏసుకుంటూ పోవాలి అని భీం చెప్పిన డైలాగ్.. ఈ నక్కల వేట ఎంతసేపు... కుంభస్థలాన్ని కొడదాం పదా అంటూ అల్లూరి గా చరణ్ చెప్పే డైలాగ్స్ ఫాన్స్ కి గూస్ బమ్స్ తెప్పించేవిలా ఉన్నాయి.

రామ్ చరణ్ - ఎన్టీఆర్ ఫ్రెండ్ షిప్, చెయ్యి చెయ్యి కలిపి చేసే యుద్ధం, హీరోస్ ఇంట్రడక్షన్ సీన్స్, అల్లూరిలా రామ్ చరణ్ బాణాలతో శత్రువులని వేటాడడం, బైక్ ని ఎత్తిపట్టి కొమరం భీం బ్రిటిష్ సైన్యాన్ని చితక్కొట్టడం, యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్స్, కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్, ప్రతి షాట్, ప్రతి సీన్ చూడడానికి రెండు కళ్ళు చాలవేమో అనేలా డైలాగ్స్, ఎమోషన్స్ అన్నీ హైలైట్‌ అనేలా ఉంటే.. ట్రైలర్ లో లాస్ట్ సీన్ మాత్రం ఆర్.ఆర్.ఆర్ కే హైలెట్ సీన్ లా కనబడుతుంది.. చరణ్, ఎన్టీఆర్ కలిసి ఎగ్గిరి మంచే మీదకి దూకే సీన్ చూస్తే ఫాన్స్ కి రచ్చ రచ్చే. 

Click Here For: RRR Trailer

RRR Trailer Highlights :

Ram Charan - NTR RRR Trailer Highlights 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs