Advertisement
Google Ads BL

మరోసారి బ్రహ్మి టైం స్టార్ట్


ఒకప్పుడు కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం లేనిదే స్టార్స్ సినిమాలే ఉండేవి కావు. కానీ ఇప్పుడు బ్రహ్మానందం లేకుండానే సినిమాలు తెరకెక్కుతున్నాయి. త్రివిక్రమ్ లాంటి వారు మాత్రమే బ్రహ్మి కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తప్ప.. చాలామంది దర్శకులు బ్రహ్మీని తమ ఆలోచనల్లో నుండి తీసేసి చాలా రోజులైంది. కానీ 38 ఏళ్ళు నిర్విరామంగా పని చేసి.. నాలుగు షిఫ్ట్ ల్లో పని చేసి.. ఎక్కే ఫ్లైట్ ఎక్కి దిగే ఫ్లై దిగి.. అలసిపోయిన నేనే సినిమాల నుండి కొద్దిగా విరామం తీసుకున్నాను కానీ.. బ్రహ్మి టైం అయిపోలేదు అంటున్నారు బ్రహ్మానందం.. ఈమధ్యన కామెడీ షో, టాక్ షోస్ లో ఎక్కువగా దర్శనమిస్తున్న బ్రహ్మానందం లో కామెడీ యాంగిల్ పోలేదు అంటూ.. ఈ మధ్య బ్రహ్మానందంతో మాట్లాడుతుంటే కామెడీ ఉండట్లేదు.. అంతా వేదాంతం చెప్పేస్తున్నాడ అని అంటుంటారు. కామెడీ, వేదాంతం, నిజం వేర్వేరు కాదు.. అంతా ఒక్కటే. అంటూ అలీ తో జాలిగా, బాలయ్య అన్ స్టాపబుల్ షోస్ లో చూపించారు.

Advertisement
CJ Advs

అలాగే గుండె ఆపరేషన్ వలన, కరోనా కారణంగా రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాను కానీ.. నేను ఇప్పుడు సినిమాల్లో నటిస్తున్నానని అంటున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్, రంగమార్తాండ, కలవారి కోడళ్లు, నితిన్ తో ఓ మూవీ.. ఇలా కొన్ని సినిమాల్లో నటిస్తున్నట్లుగా బ్రహ్మానందం చెప్పడం చూస్తే మరోసారి వెండితెర మీద బ్రహ్మి హవా స్టార్ట్ అయినట్లే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎక్కువగా బ్రహ్మానందం.. సో భీమ్లా నాయక్ లోనూ ఉన్నట్లుగా బ్రహ్మి కంఫర్మ్ చెయ్యడంతో.. ఆయన ఫాన్స్ హ్యాపీ.

Brahmi time start once again:

Brahmanandam in Bheemla nayak
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs