Advertisement
Google Ads BL

పుష్ప మాస్ జాతర ఎప్పుడంటే..


అల్లు అర్జున్ - రష్మిక మందన్న కాంబోలో సుకుమార్ తెరకెక్కించిన పుష్ప పాన్ ఇండియా మూవీ రిలీజ్ కి టైం దగ్గర పడే కొద్దీ.. అల్లు అర్జున్ ఫాన్స్ లోనే కాదు.. పాన్ ఇండియా ప్రేక్షకుల్లోనూ ఆసక్తి, అంచనాలు పెరిగిపోతున్నాయి. కరోనా పాండమిక్ సిట్యువేషన్ ని దాటిన తర్వాత రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా, పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా పుష్ప సినిమా ఉండడంతో.. ఆ సినిమాపై అన్ని భాష ప్రేక్షకులలో ఆత్రుత అంతకంతకు పెరుగుతుంది. ఇప్పటికే పుష్ప నుండి రిలీజ్ అయిన సాంగ్స్ మాస్ ప్రేక్షకులని ఊపేస్తున్నాయి. ఇప్పుడు పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ ని కకూడా రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా టీం ప్రకటించింది.

Advertisement
CJ Advs

అందులోనూ ప్రస్తుతం ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ గా ఉన్న హీరోయిన్ సమంత ఫస్ట్ టైం పుష్ప సినిమాలో మాస్ స్టెప్స్ వెయ్యబోతుంది. ఆ సాంగ్ చిత్రీకరణ ఈ మధ్యనే పూర్తయ్యింది. సుకుమార్ - అల్లు అర్జున్ - దేవిశ్రీ కాంబో లో మాస్ సాంగ్, ఐటెం నెంబర్ ఎలా ఉంటాయో అందరికి తెలుసు. అందుకే పుష్ప స్పెషల్ సాంగ్ పై అందరిలో అంతగా అంచనాలు. అందులోనూ సమంత ఆ సాంగ్ చేసింది అనగానే ఆ అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. సమంత - అల్లు అర్జున్ కలయికలో రాబోతున్న ఊ అంటావా ఊ ఊ అంటావా సాంగ్ ని డిసెంబర్ 10 న రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా పుష్ప మేకర్స్ సమంత కత్తిలాంటి పోస్టర్ తో ప్రకటించారు.. ఆ పోస్టర్ లో సమంత కర్లీ హెయిర్, అదిరిపోయే గ్లామర్ డ్రెస్ తో కనిపించడమే కాదు.. ఫేస్ లోని ఎక్సప్రెషన్ చూస్తే.. సమంత నే ఈ సాంగ్ కి పర్ఫెక్ట్ అనేలా ఉంది. ఈ మాస్ జాతర ప్రకటనతో అల్లు ఫాన్స్ ఫుల్ హ్యాపీ.   

Pushpa to tease with the sizzling song on:

Pushpa sizzling song on
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs