ప్రభాస్ - పూజ హెగ్డే కలయికలో రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న రాధేశ్యామ్ మూవీ నుండి సోచ్ లియా సాంగ్ విడుదలైంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ సాంగ్ వైరల్ అవుతుంది. ఆషికి 2, కబీర్ సింగ్ సినిమాకు మ్యాజిక్ చేసిన మిథున్, అర్జీత్ సింగ్ కాంబినేషన్‌లో ఈ సాంగ్ తెరకెక్కింది. రాధేశ్యామ్ నుండి మొన్న విడుదలైన ఆషికి ఆ గయీ ఎలా అయితే ఇన్స్టెంట్ హిట్ అయిందో ఇప్పుడు ఈ పాట కూడా అలాగే అద్భుతమైన స్పందన తెచ్చుకుంటుంది. ఈ పాటలో ప్రభాస్, పూజా హెగ్డే ఇద్దరూ చాలా అందంగా, రొమాంటిక్ గా కనిపిస్తున్నారు.
అయితే రాధేశ్యామ్ హిందీ వర్షన్‌కు మాత్రం మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇటలీలో జరిగే ప్రేమకథగా రాధే శ్యామ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. అందుకే ఒకే గుండెకు రెండు చప్పుళ్లు అనే పోస్టర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.