Advertisement
Google Ads BL

సోషల్ మీడియాని కబ్జా చేసిన పుష్ప, RRR


గత వారం రోజులుగా సోషల్ మీడియాలో పుష్ప, ఆర్.ఆర్.ఆర్ ల రాజ్యమే నడుస్తుంది. పుష్ప ట్రైలర్, ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ అంటూ రోజుకో పోస్టర్, వీడియోస్ ని రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో అంచనాలు, ఆసక్తిని పెంచేస్తున్నారు. వారం రోజుల నుండి ఈ రెండు పాన్ ఇండియా మూవీస్ మాత్రమే తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ సోమవారం డిసెంబర్ 6 సాయంత్రం పుష్ప ట్రైలర్ రిలీజ్ అయ్యింది.. ఇక ఆ ట్రైలర్ ఇన్ని మిలియన్ వ్యూస్, అన్ని మిలియన్ వ్యూస్ అంటూ పుష్ప పీఆర్ టీం సోషల్ మీడియాలో పోస్ట్ చేసే పోస్టర్స్ తో అల్లు అర్జున్ ఫాన్స్ రెచ్చిపోయి ట్వీట్స్ చెయ్యడంతో.. పుష్ప రాజ్, పుష్ప, అల్లు అర్జున్ హాష్ టాగ్స్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.

Advertisement
CJ Advs

మరో పక్క రాజమౌళి డిసెంబర్ 9 న రిలీజ్ కాబోయే ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ పై అందరి అటెంక్షన్ ఉండేలా.. కొమరం భీం అంటూ ఎన్టీఆర్ సూపర్ పోస్టర్ ని, అల్లూరి సీతారామరాజు రామ్ చరణ్ సిక్స్ ప్యాక్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చెయ్యడం, అలాగే ట్రైలర్ వీడియోస్ అంటూ రోజుకో వీడియో తో ట్రైలర్ పై అంచనాలు పెంచడమే కాదు.. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫాన్స్, రామ్ చరణ్ ఫాన్స్ కలిపి ఆర్.ఆర్.ఆర్ ని ట్రెండ్ చేస్తున్నారు. అలాగే అలియా భట్ ఫాన్స్, అజయ్ దేవగన్ ఫాన్స్ ని కూడా ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ తో రంగంలోకి దించే ప్లాన్ లో ఉన్నారు. ప్రభాస్ రాధేశ్యామ్, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ల అప్ డేట్స్ అటు ఇటుగా ఇవ్వడంతో.. పుష్ప, ఆర్.ఆర్.ఆర్ అప్ డేట్స్ తో సోషల్ మీడియా కళకళలాడుతుంది. ఇక ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్, పుష్ప మూవీస్ సోషల్ మీడియా ని మాత్రం కబ్జా చేశాయనే చెప్పాలి.. ఆ విధంగా ఉన్నాయి.. వాటి క్రేజ్, ఆ సినిమాలపై అంచనాలు.. ఆ రేంజ్ లో ఉన్నాయి.

Pushpa and RRR Capture Social Media Attention:

Interesting updates on Pan India Movie Pushpa and RRR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs