అఖండ మూవీ ఓటిటి డేట్ ఫిక్స్ అయ్యిందా..


డిసెంబర్ 2 న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ అఖండ మూవీ కి మాస్ ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. సింహ, లెజెండ్ మూవీస్ మాదిరిగానే.. వారి కాంబోలో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన అఖండ తో హ్యాట్రిక్ హిట్ కొట్టారు బాలయ్య అండ్ బోయపాటిలు. అఖండ మూవీ సక్సెస్ ని ఇండస్ట్రీ హిట్ అంటూ పలువురు ప్రముఖులు ట్వీట్ చేస్తున్నారు.ఈ సినిమాలో బాలకృష్ణ విశ్వ రూపం, థమన్ మ్యూజిక్, బోయపాటి మ్యూజిక్, డైలాగ్స్ అన్ని హైలెట్ అవ్వగా.. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీసు బూజులు దులిపే ప్రోగ్రాం లో ఉంది. ఆల్మోస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప వచ్చేవరకు థియేటర్స్ లో అఖండ దే హవా నడిచేలా కనిపిస్తుంది.

అయితే అఖండ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులని డిస్ని ప్లస్ హాట్ స్టార్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హాట్ స్టార్ లోనూ, శాటిలైట్ హక్కులు స్టార్ మా దక్కించుకోగా.. ఇప్పుడు అఖండ మూవీ డిజిటల్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది అంటున్నారు. అయితే అఖండ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజుల వ్యవధిలోనే డిస్ని హాట్ స్టార్ లో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే 2022 కొత్త సంవత్సరం కానుకగా సినిమాను హాట్ స్టార్ లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. అఖండ రిలీజ్ అయిన రెండు వారాల తర్వాత ఈ డేట్ ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. 

Akhanda OTT Release Date Confirmed?:

Akhanda OTT Release Date, Digital Rights and OTT Platform
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES