బిగ్ బాస్ సీజన్ 5 హౌస్ లో ఆల్మోస్ట్ టాస్క్ లు పూర్తయ్యి.. చివరి రెండు వారాల్లో మిగిలిన ఆరుగురు హౌస్ మేట్స్ తో పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాడు బిగ్ బాస్... అలా గత రాత్రి జరిగిన ఎపిసోడ్ లో సన్నీ ప్రియాంక కింద, కాజల్ మానస్ కింద గెటప్స్ వేసుకోగా.. మానస్ సన్నీ - కాజల్ చేసే పనికి హార్ట్ అయ్యి.. ప్యూర్ జర్నీ చూపించండి.. ఎక్సట్రాలు కాదు అంటూ కాజల్ పై ఫైర్ అయ్యాడు. దానితో మానస్ ప్రియాంక కింద, సన్నీ మానస్ కింద గెటప్స్ మార్చేసి.. ప్రియాంకకి ఏదో చెప్పడానికి ట్రై చేసారు. మానస్ కేవలం ఫ్రెండ్ లాగే చూస్తున్నాడు.. ఇంకేం లేదు.. అది ప్రియాంకకి అర్ధమైతే చాలు అంటూ సన్నీ కాజల్ మట్లాడుకున్నారు. మానస్ కి చాలాసార్లు చెప్పాను.. ఆడపిల్లకి అర్ధమయ్యేలా చెప్పాలని, కానీ ఆమె అర్ధం చేసుకోదు అనేవాడు అంటూ సన్నీ చెప్పుకొచ్చాడు.
ఇక ఈ రోజు ఎపిసోడ్ లో షణ్ముఖ్ - సిరి ల మధ్యన గొడవైనట్లుగా చూపించారు.. సన్నీ షణ్ముఖ్ ని ఇమిటేట్ చేస్తున్నప్పుడు.. షణ్ముఖ్ సన్నీ నీకు నిన్నే చెప్పాను, లిమిట్స్ దాటొద్దు నాకు నచ్చదని. దానితో సన్నీ నువ్ ఎలా చేసావో నేను అలానే చేశాను.. బారా బర్ చేస్తా అన్నాడు.. అయినా టాస్క్ ని టాస్క్ లా చూడు అంది సిరి షణ్ముఖ్ తో.. అదిగో నువ్వు నన్ను అంటావా అంటూ షణ్ముఖ్ రెచ్చిపోయి సిరిని తిట్టాడు. సిరి అంటే నెగటివ్ నెగెటివ్ అంటూ షణ్ముఖ్ పై విరుచుకుపడింది సిరి.. ఓవర్ చెయ్యకు సిరి నీ పని నువ్ చూసుకో అన్నాడు.
వంట చేస్తూ కూడా సిరి అండ్ షణ్ముఖ్ లు గొడవ పడ్డారు.. టాస్క్ చేస్తున్నప్పుడు కూడా బిగ్ బాస్ కి చెబుతావ్.. అంటే నాకు టాస్క్ చెయ్యడం రాదనా.. నాకు తెలియదా అన్నాడు షణ్ముఖ్.. నువ్వు నా ఫ్రెండ్ అని చెబుతున్నా అంది సిరి.. నువ్వు వేరే వాడికి ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా నాకు ఇవ్వవు.. నువ్వే నన్ను తక్కువ చేస్తున్నావ్ అంటూ షణ్ముఖ్ - సిరి పెద్దగానే గొడవ పడిన ప్రోమో వైరల్ అయ్యింది.