మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ షూటింగ్ కంప్లీట్ చేసినా.. ఇంకా ప్యాచ్ వర్క్ షూట్ లో పాల్గొంటున్నారు. అలాగే మలయాళ హిట్ లూసిఫెర్ రీమేక్ గాడ్ ఫాదర్ షూట్ లో మోహన్ రాజా దర్శకత్వంలో పాల్గొంటున్నారు. ఇక హైదరాబాద్ లోనే రికార్డ్ స్థాయిలో మెగాస్టార్ ఈ నెలలో మరో రెండు ప్రాజెక్ట్స్ షూట్ లో కూడా పాల్గొనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంటే డిసెంబర్ ఒక్క నెలలోనే మెగాస్టార్ చిరు నాలుగు సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. మెహర్ రమేష్ తో భోళా శంకర్ అలాగే బాబీ దర్శకత్వం లో చిరు 154 షూటింగ్స్ లోను మెగాస్టార్ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్, నయనతార లాంటి టాప్ స్టార్స్ కూడా ఉన్నారు. భోళా శంకర్ లో కీర్తి సురేష్, తమన్నాలు నటిస్తున్నారు. ఇక బాబీ ప్రాజెక్ట్ వివరాలు మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే ఉన్నాయి.
పూనకాలు లోడింగ్, అరాచకంగా ఆరంభం అంటూ మాస్ పోస్టర్ తోనే చిరు 154 పై అంచనాలు పెంచేసిన బాబీ.. ఈ సినిమాకి టైటిల్ గా వాల్తేరు వాసు, వాల్తేరు శీను, వాల్తేరు వీర్రాజు అనుకుంటున్నారని టాక్ ఉంది. ఆ టైటిల్స్ సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతున్నాయి.. అయితే మెగా కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. చిరు 154 కి అదిరిపోయే టైటిల్ ని ఫిక్స్ చేసారని.. మాస్ ప్రేక్షకులను ఊపేసేలా వాల్తేరు వీరయ్య టైటిల్ ని ఫిక్స్ చేసినట్లుగా సమాచారం. వాల్తేరు వీరయ్యగా మెగాస్టార్ చిరంజీవి.. ఊరమాస్ లుక్ లో కనిపిస్తారని.. ఈ సినిమా పక్కా మాస్ మసాలా మూవీలా ఉండబోతుంది అని అంటున్నారు.