Advertisement
Google Ads BL

అబ్బా ఏమైనా కాంబినేషనా.. ఇది


ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగా మల్టీస్టారర్స్ పర్వం నడుస్తుంది. అందులో ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా హీరో రామ్ చరణ్ కలిసి పాన్ ఇండియా లెవల్లో ఆర్.ఆర్.ఆర్ మూవీ చెయ్యడం, అలాగే తండ్రి కొడుకులైన రామ్ చరణ్ - మెగాస్టార్ చిరంజీవి కలిసి ఆచార్య మూవీ చెయ్యడం, ఇంకా పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో భీమ్లా నాయక్ మల్టీస్టారర్ మూవీస్ తో ఇప్పుడు టాలీవుడ్ క్రేజీగా కనబడుతుంది. అలాగే స్టార్ హీరోస్ కూడా కలిసి నటించడానికి ఎలాంటి భేషజాలకు పోవడం లేదు. ఇక ఆచార్య లో అసలైతే మహేష్ బాబు - చిరు కలిసి నటించాల్సింది.. కానీ మహేష్ ప్లేస్ లోకి రామ్ చరణ్ వచ్చాడు.

Advertisement
CJ Advs

ఇక తర్వాత కొరటాల కాంబినేషన్స్  లో మహేష్ బాబు - బాలకృష్ణ లు కలిసి నటించబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ బాలకృష్ణ - మహేష్ కలిసి కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నారని అంటున్నారు. మరి అనిల్ రావిపూడి తో బాలయ్య ఎలాగూ కమిట్ అయ్యారు. NBK107 తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి డైరెక్షన్ లోనే చేస్తున్నారు. అలాగే మహేష్ తో సరిలేరు నీకెవ్వరూ తర్వాత అనిల్ మరో సినిమా ప్లాన్ చేసినా.. అది కుదరలేదు. సో బాలకృష్ణ - మహేష్ కలయికలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో మూవీ అనగానే అటు బాలయ్య ఫాన్స్ కి, ఇటు మహేష్ ఫాన్స్ కి ఊపొచ్చేసింది. ఇప్పటికే బాలకృష్ణ - మహేష్ కలిసి అన్ స్టాపబుల్ టాక్ షో చేసారు.

మరి మహేష్ - బాలకృష్ణ కాంబో ఎవరి దర్శకత్వంలో వస్తే ఏమిటి.. అసలు వారి కాంబినేషన్ సెట్ అయితే సిల్వర్ స్క్రీన్ మీద వారిద్దరూ కలిసి కనబడితే.. ఫాన్స్ ఆగుతారా.. మరి వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించాలనేది ఫాన్స్ కోరిక.. అది ఎప్పటికి తీరుతుందో చూడాలి. 

Balakrishna - Mahesh Babu combo on cards :

Balakrishna-Mahesh Babu to blast the screen..?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs