రామ్ చరణ్ - ఎన్టీఆర్ కలయికలో రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ వరల్డ్ వైడ్ గా ఫాన్స్ కి కిక్ ఇవ్వడానికి జనవరి 7 న రాబోతుంది. ఎన్టీఆర్ ఫాన్స్, రామ్ చరణ్ ఫాన్స్ మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి కి ఉన్న ఫాన్స్ కూడా సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. అనే ఆతృతలో ఉన్నారు. ఇక రేపు అంటే డిసెంబర్ 9 న రిలీజ్ కాబోయే ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ పైనే ఇప్పుడు అందరి చూపు.. ప్రతి రోజు ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ ట్రైలర్ పై ఆసక్తిని పెంచుతూ వదిలే పోస్టర్స్, వీడియో బైట్స్ అన్ని ఫాన్స్ ని విపరీతంగా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ కొమరం భీం, అల్లూరి పోస్టర్స్ తో ఫాన్స్ కడుపు నింపేసుకుంటున్నారు. ఇక ట్రైలర్ వస్తే ఆగుతారా అన్నట్టుగా ఉన్నారు వారు.
ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ ని డిసెంబర్ 9 న నాలుగు బిగ్ సిటీస్ లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసారని, ముంబై, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ నగరాల్లో ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారని, దాని కోసం ఆర్.ఆర్.ఆర్ టీం ఓ ప్రవేట్ జెట్ కూడా అద్దెకి తీసుకున్నట్టుగా టాక్. ఆర్.ఆర్.ఆర్ హిందీ వెర్షన్ ట్రైలర్ మొదట ఉదయం 11 గంటలకు ముంబైలోని పివిఆర్ ఒబెరాయ్ మాల్‌లో లాంచ్ అవుతుందని.. ఈ ట్రైలర్ లాంచ్‌కు రామ్ చరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవగన్, అలియా భట్ హాజరవుతారని వారితో ఆప్తుగా స్పెషల్ గెస్ట్ గా మెగాస్టార్ కూడా ముంబై కి వెళ్ళబోతున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. మిగతా చెన్నై, హైదరాబాద్, బెంగుళూరులలో మాత్రం ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ ప్రత్యేకంగా ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ లాంచ్ చేస్తారని తెలుస్తుంది.