Advertisement
Google Ads BL

కత్రినా - విక్కీ పెళ్లి కూడా బిజినెస్సే


బాలీవుడ్ మొత్తం ఇప్పుడు కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ ల పెళ్లి ముచ్చట్లే వినిపిస్తున్నాయి. ఈ రోజే కత్రినా మరియు విక్కి కుటుంబ సభ్యులు రాజస్థాన్ కి పయనమవుతున్నారు. కత్రినా కైఫ్-విక్కీ కౌశల్‌ డిసెంబర్‌ 9న రాజస్థాన్ లో గ్రాండ్ గా పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఇప్పటికే కత్రినా - విక్కి కౌశల్ ల పెళ్లి కి వెళ్లబోయే సెలబ్రిటీస్ పై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది.. కియారా అద్వానీ, సల్మాన్ ఖాన్ ఫ్యామిలీని కత్రినా విక్కీలు పెళ్ళికి పిలవలేదనే టాక్ సోషల్ మీడియా ని ఊపేసింది. అయితే కత్రినా కైఫ్ - విక్కి కౌశల్ లు తమ పెళ్ళికి ఎలాంటి ఫొటోస్ కానీ, వీడియోస్ తియ్యకుండా ముందు జాగ్రత్తగా పెళ్లి వేడుకలు దగ్గరికి సెల్ ఫోన్స్ తేకుండా కండిషన్ పెట్టారని అంటున్నారు. 

Advertisement
CJ Advs

ఫొటోలు, సెల్ఫీలు తీసి సోషల్‌మీడియాలో షేర్‌ చేయొద్దని కత్రినా ఇంకా విక్కి కౌశల్ లి ఆంక్షలు పెట్టారు అని, అయితే దీనికి ఓ బిజినెస్ డీల్ ఉంది అని.. అందుకే ఫోటో సోషల్ మీడియాలో షేర్ చెయ్యకుండా ఆపుతున్నారని తెలుస్తుంది. అది కత్రినా - విక్కి కౌశల్ ల వివాహ వేడుకలని ప్రసారం చేసేందుకు, ఫొటోస్, వీడియోస్ అన్ని వారే ప్రసారం చేసే విధంగా ఓ ప్రముఖ ఓటిటి కత్రినా కి విక్కి కి ఓ అద్భుతమైన బిజినెస్ డీల్ ఇచ్చింది అని, దాని కోసం 100కోట్ల భారీ ఆఫర్‌ కూడా ఇచ్చిందట. కానీ ఈ విషయంలో కత్రినా-విక్కీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు అని తెలుస్తుంది. అయితే ఇప్పుడు కత్రినా - విక్కీల పెళ్లి కూడా ఓ బిజినెస్సే అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Katrina Kaif-Vicky Kaushal Wedding: Couple Get Rs 100-Crore Offer:

Katrina Kaif-Vicky Kaushal Wedding: Couple Get Rs 100-Crore Offer From OTT Giant for Wedding Videos, Pics?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs