Advertisement
Google Ads BL

అఖండ పై ఇంత నెగెటివిటినా


భారీ అంచనాలతో భారీగా డిసెంబర్ 2 న రిలీజ్ అయిన బాలకృష్ణ అఖండ మూవీ కి పాజిటివ్ టాక్ రావడం, చాలారోజులకి బాక్సాఫీసు పెద్ద సినిమాతో కళకళలాడడం, బాలయ్య అఖండ నట విశ్వరూపానికి ముగ్దులైన ఫాన్స్ అలాగే ఇండస్ట్రీ ప్రముఖులు అఖండ మూవీ పై పాజిటివ్ గా ట్వీట్స్ వెయ్యడం, సినిమా రిలీజ్ అయిన రోజునే మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు అఖండ మూవీ పై ట్వీట్స్ చెయ్యడం అన్ని అఖండ విజయాన్ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యేలా చేసాయి. కానీ కొంతమంది అఖండ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అఖండ హిట్ అంటూ ఓవర్సీస్ టాక్ వచ్చిందో లేదో.. అక్కడ ఓ వర్గం(కులం) వారు అఖండ  మూవీ చూసి, కావాలని పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేసారని, అలాగే సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన స్టార్స్ కూడా అదే వర్గానికి చెందిన వారు అని, ఓ యంగ్ ప్రొడ్యూసర్ కావాలనే స్టార్స్ చేత అఖండ పై ట్వీట్స్ చేయించారంటూ సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నారు.

Advertisement
CJ Advs

అఖండ విజయం కమ్మ విజయమంటూ.. మరో కులం వారు రాళ్లు రువుతున్నారు. ఇది పనిగట్టుకుని చేస్తున్న పనిలా ఉంది. అఖండ మూవీ విజయం ఇండస్ట్రీ విజయమని సెలబ్రిటీస్ ట్వీట్ చెయ్యడం చూసిన వారు.. ఇదేదో.. అఖండ మూవీ పై క్రేజ్ పెంచడానికి అని, అలాగే సోషల్ మీడియాలో మహేష్ బాబు, ఎన్టీఆర్ లు అఖండ మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్ కి హాజరౌతారనే రూమర్ ని కూడా తమకి అనుకూలంగా మార్చేసుకుని, మహేష్ ఈ ఈవెంట్ కి రాడు.. వచ్చినా పర్సనల్ గా బాలయ్య కోసం వస్తాడు.. ఇక ఎన్టీఆర్ పార్టీకి, బాలయ్య కి ఫ్యామిలీకి భయపడి అఖండ ఈవెంట్ కి హాజరవుతారు అంటూ అఖండ విజయంపై విషం చిమ్ముతూ కొంతమంది పైశాచికానందం పొందుతున్నారు. మరి బాలకృష్ణ అంటే కసి, కోపం ఏదైనా ఉండొచ్చు.. కానీ.. సినిమా విజయాన్ని ఇలా పనిగట్టుకుని చంపెయ్యడం ఏమైనా ధర్మమా..అని నెటిజెన్స్ వారిపై విరుచుకుపడుతున్నారు. 

So much negativity on Akhanda's huge success:

Negativity spreading on Akhanda's huge success
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs