Advertisement
Google Ads BL

పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నార్రా.. ఫైర్


సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న పుష్ప మూవీ ట్రైలర్ ఈ రోజు డిసెంబర్ 6 సాయంత్రం 6.03 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నామంటూ మేకర్స్ గత వారం రోజులుగా పుష్ప ట్రైలర్ పై అంచనాలు పెంచేశారు. అయితే సాయంత్రం 6.03 నిముషాలు, 6.10 నిమిషాలైనా పుష్ప ట్రైలర్ జాడ లేదు.. ఇంతలోపులో పుష్ప పిఆర్ టీం.. కొన్ని టెక్నీకల్ ప్రాబ్లమ్స్ వలన పుష్ప్ర ట్రైలర్ అనుకున్న టైం కి రావడం లేదు.. సారి అని చెప్పి.. స్టే ట్యూన్డ్ అంటూ ఎప్పుడు వదులుతారో అనే విషయాన్ని చెప్పకుండా.. సస్పెన్స్ లో పెట్టారు. ఇక కాస్త లేట్ అయినా పుష్ప ట్రైలర్ డిసెంబర్ 6 రాత్రి 9.30 కి రిలీజ్ చేసి సోషల్ మీడియాని ఊపేసారు.

Advertisement
CJ Advs

పుష్ప ట్రైలర్ లోకి వెళితే.. భూమండలంలో ఏడ పెరగని చెట్టు మన శేషాచలం అడవుల్లో పెరుగుతుండాది..  అని బ్యాగ్రౌండ్ లో డైలాగ్ చెప్పగానే.. అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చాడు.. ఇక్కడి నుండి వేల కోట్ల సరుకు విదేశలకి స్మగ్లింగ్ అవుతున్నది అంటూ లారీలలో ఎర్ర చందనం దుంగలని ఎక్సపోర్ట్ చెయ్యడం, గోల్డ్ రా ఇది.. భూమిపై పెరిగే బంగారం అంటూ చెప్పే డైలాగ్ విజువల్ గా ఆకట్టుకుంది. మధ్యలో పుష్ప రాజ్ చేసే యాక్షన్ విన్యాసాలు, అల్లు అర్జున్ ని జైల్లో పెట్టి చితక్కొడుతూ ఎక్కడ దాచిపెట్టావ్ రా సరుకు అని పోలీస్ అడిగితే.. దానికి పుష్ప రాజ్.. చెబితే మా బాస్ చంపేస్తాడు.. అనగానే ఎవడు నీ బాస్ అంటాడు పోలీస్.. మధ్యలో హీరోయిన్ రష్మిక గ్లామర్ ఎంట్రీ.. డీ గ్లామర్ గానే రష్మిక అందాలు ఆరబోసేసింది. 

అనసూయ దాక్షాయణిగా నోటిలో బ్లేడుతో, సునీల్ విలనిజం, అల్లు అర్జు పోలీస్ లతో చేసే ఫైట్ సీన్, వాటర్ ఫైట్ అన్ని అద్భుతంగా అదిరిపోయాయి. అల్లు అర్జున్ ఈ లోకం మీకు తుపాకీ ఇచ్చింది. నాకు గొడ్డలిచ్చింది, ఎవ్వడి యుద్ధం వాడిదే.. పుష్ప.. పుష్ప రాజ్.. నీ యవ్వ తగ్గేదే లే అంటూ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. పుష్ప అంటే ఫ్లోవర్ (ఫ్లవర్) అనుకుంటివా.. ఫైర్ అంటూ అదరగొట్టేసాడు.. చివరిగా విలన్ ఫహద్ ఫాజిల్ పార్టీ లేదా పుష్ప అనే డైలాగ్ తో ట్రైలర్ ఎండ్ చేసారు. పాత్రల తీరుతెన్ను, అల్లు అర్జున్ పుష్ప రాజ్ యాక్షన్, సుకుమార్ మార్క్ డైరెక్షన్, విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ అన్ని పుష్ప ట్రైలర్ కి మెయిన్ హైలైట్స్ గా ఉన్నాయి.

Click Here 👉 ▶️ Pushpa Trailer

Pushpa Trailer out:

Allu Arjun - Sukumar Pushpa Trailer out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs