Advertisement
Google Ads BL

అన్ స్టాపబుల్: బాలయ్య ఎమోషన్ అయ్యాడు


బాలకృష్ణ ఆహా ఓటిటి టాక్ షో అన్ స్టాపబుల్ నిజంగానే అన్ స్టాపబుల్ అన్నట్టుగా.. దూసుకుపోతుంది. మోహన్ బాబు మంచు, నాని, బ్రహ్మానందం ఎపిసోడ్స్ అంచనాలు మించి హిట్ అవడంతో.. ఈ షో పై ఇంకా ఆసక్తి పెరిగిపోతుంది. ఇక నాలుగో ఎపిసోడ్ కి బాలకృష్ణ లేటెస్ట్ చిత్రం అఖండ మూవీ టీం వచ్చేసింది. దర్శకుడు బోయపాటి, హీరోయిన్ ప్రగ్య జైస్వాల్, శ్రీకాంత్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బాలయ్య అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ లు గా వచ్చారు. ఇక స్టేజ్ పై బాలయ్య సందడి అయన ఎనేర్జి లెవల్స్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రగ్య జైస్వాల్ తో జై బాలయ్య సాంగ్ కి స్టెప్స్ వేసిన బాలకృష్ణ.. థమన్ తోనూ, ప్రగ్య జైస్వాల్ తోనూ బాల్ ఆట ఆడించాడు. అఖండ మూవీ లో బాలకృష్ణ కి విలన్ గా నటించిన శ్రీకాంత్ అన్ స్టాపబుల్ స్టేజ్ పై పవర్ ఫుల్ డైలాగ్ చెప్పగా.. దానికి కౌంటర్ గా బాలయ్య అదిరిపోయే డైలాగ్ చెప్పారు.

Advertisement
CJ Advs

ఎవరైనా విలన్ కేరెక్టర్ ఇస్తే చేస్తాను, దానిలో హీరో కూడా నేనే అంటూ బాలయ్య అదరగొట్టేసాడు. బోయపాటి మాత్రం అందరికి ప్రశ్న మీరైతే.. నాకు సమాధానం మీరు బాబు అన్నాడు. అఖండ టీం తో అదిరిపోయే అల్లరి, కామెడీ చేసి హుషారెత్తించిన బాలకృష్ణ.. అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ప్రోమో 4 లో ఎమోషనల్ గా కన్నీటి పర్యంతమయ్యారు. అది తలుచుకుంటే కన్నీళ్లు వస్తాయి.. వెన్నుపోటు అంటూ అప్పట్లో తప్పుడు ప్రచారం చేశారు. దాని గురించి చెప్తుంటే కళ్లలో నీళ్లొస్తాయి. ఎందుకంటే నేను ఆయన కొడుకుల్లో ఒకడిని.. ఆయన ఫాన్స్ లో ఒకడిని అంటూ సీనియర్ ఎన్టీఆర్ వెన్నుపోటు పై బాలయ్య ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం బాలయ్య ఎమోషనల్ అయిన ప్రోమో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Balakrishna about his Father NTR :

Balakrishna about his Father NTR in Unstoppable Talk show
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs