Advertisement
Google Ads BL

యశోదగా సమంత... 


నాగ చైతన్య తో విడాకుల తర్వాత సమంత  జోరు మాములుగా లేదు.. ఇప్పటికే పాన్ ఇండియా ఫిలిం పుష్ప లో అల్లు అర్జున్ తో కలిసి మాస్ స్టెప్స్ కి కాలు కదిపినా సమంత.. ఇప్పుడు యశోద గా రాబోతుంది.

Advertisement
CJ Advs

సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రానికి యశోద టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 

ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్‌తో సమంతకు జాతీయ స్థాయిలో పేరొచ్చింది. ఆమెకు క్రేజ్ ఏర్పడింది. సమంత నటనకు వీక్షకులు సహా విమర్శకులు ఫిదా అయ్యారు. తెలుగు, తమిళ సినిమాల్లో పోషించిన పాత్రలకు భిన్నమైన పాత్రను ఆ వెబ్ సిరీస్‌లో చేశారు. దాంతో సమంత పొటెన్షియల్ ఏమిటన్నది అందరికీ తెలిసింది. ప్రస్తుతం సమంతకు ఉన్న క్రేజ్‌కు, పొటెన్షియ‌ల్‌కు త‌గ్గ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్ర‌మిది. యశోద చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషలో తెరకెక్కిస్తున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సమంత ప్రధాన పాత్రలో నిర్మిస్తున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రమిది. బాలకృష్ణగారితో ఆదిత్య 369 తీశాను. ఆయనతో మరో మూడు చిత్రాలు చేశాను. నానితో జెంటిల్‌మన్‌, సుధీర్‌బాబుతో సమ్మోహనం నిర్మించాను. ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. థ్రిల్లర్ జాన‌ర్‌లో నేషనల్ లెవ‌ల్‌లో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునే కథాంశంతో తీస్తున్న చిత్రమిది. సమంత క్రేజ్, పొటెన్షియల్, ఫ్యాన్ ఫాలోయింగ్‌కు తగ్గ కథ కుదిరింది. ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాం. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేశాం. మార్చితో చిత్రీకరణ పూర్తవుతుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు అని చెప్పారు. తమిళంలో మైనా, కుంకీ, గీతు... తెలుగులో చిలసౌ, రిపబ్లిక్ తదితర సినిమాలకు పని చేసిన ఎం. సుకుమార్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించనున్నారు. 

సమంతతో పాటు సినిమాలో నటించే ఇతర తారాగణం వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Samantha New Project Yashoda launch:

Samantha New Project Yashoda Under Sridevi Movies Production Commences Shoot
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs