Advertisement
Google Ads BL

ఆర్.ఆర్.ఆర్: ఇది కదా ఫాన్స్ కి కావాల్సింది


రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ మూవీపై పాన్ ఇండియా మార్కెట్ లో భారీ అంచనాలే ఉన్నాయి. డిసెంబర్ 9 న విడుదల కాబోతున్న ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ తోనే జనవరి 7న రిలీజ్ కాబోయే ఆర్.ఆర్.ఆర్ పై మరిన్ని అంచనాలు పెరిగేలా రాజమౌళి ప్లాన్ చేసారు. అందులో భాగంగానే ఆర్.ఆర్.ఆర్ నుండి ఈ రోజు అంటే డిసెంబర్ 6 ఉదయం 11గంటలకి ఎన్టీఆర్ కొమరం భీమ్ పోస్టర్ ని, సాయంత్రం 4గంటలకి రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పోస్టర్ న రివీల్ చెయ్యబోతున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. మరి ఆర్.ఆర్.ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీం గా ఎలా ఉంటాడో అనేది ఆయన కొమరం భీం వీడియో లోనూ, అలాగే ముస్లిం గెటప్ లోనూ, బైక్ పై చరణ్ తోనూ ఉన్న పోస్టర్స్ తో రివీల్ అయ్యాయి. 

Advertisement
CJ Advs

మరి కొత్త పోస్టర్ లో ఏముండబోతుందో.. అందులో ఏం ప్రత్యేకత ఉందో అనేది ఎన్టీఆర్ ఫాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది.. ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ కొత్త పోస్టర్ వచ్చేసింది. ఆ పోస్టర్ ఎన్టీఆర్ కండల వీరుడిలా అదిరిపోయే దేహంతో చాలా ఉగ్ర రూపం లో కనిపించాడు. రెండు చేతులతో తాళ్లని పట్టుకున్న ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్, ఎన్టీఆర్ మోహంలో ఆ ఉగ్రత అన్ని కొమరం భీం పై అందరిలో అంచనాలు పెంచేలా ఉంది. చిన్న పంచె కట్టుతో ఎన్టీఆర్ రక్తంతో తడిచిన దేహంతో శత్రు మూక పై దాడి చెయ్యడానికి సిద్దమైనట్లుగా కనిపిస్తుంది.. ఈ పోస్టర్.. ఇంకా చెప్పాలి అంటే ఆర్.ఆర్.ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీం గా ఈ పిక్ లో ఎన్టీఆర్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. రాజమౌళి ఎన్టీఆర్ ని ఏం చూపించవయ్యా అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ ఖుషి అవుతున్నారు.

NTR as BHEEM from RRR Movie:

Young Tiger NTR as KOMARAM BHEEM from RRR Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs