బాలీవుడ్ లో ఇప్పుడు కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ ల పెళ్లి మాత్రమే హాట్ టాపిక్. దానితో పాటు రణబీర్ కపూర్ - అలియా భట్ లు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారని న్యూస్ కూడా ఎప్పటినుండో నడుస్తుంది.. ఇక మరో ప్రేమ జంట మాత్రం పెళ్లి పేరెత్తకుండా.. వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తుంటుంది. వారే మలైకా అరోరా - అర్జున్ కపూర్ ల జంట. వారి మధ్యలో వయసు రీత్యా ఎంతో వ్యత్యాసం ఉన్నప్పటికీ.. మలైకా ని అర్జున్ కపూర్ అస్సలు వదలడు.. తన ప్రేయసిని తీసుకుని వెకేషన్స్ కి చెక్కేస్తుంటాడు.. అలాగే ఏదైనా పబ్లిక్ ఈవెంట్స్ కి వెళ్ళినా, బాలీవుడ్ పార్టీలకి హాజరైనా మలైకాని బాడీ గార్డ్ లా ఆమెని కాపాడుకునే సన్నివేశాలు కోకొల్లలు. ఒకప్పుడు సీక్రెట్ గా నడిచిన వీరి లవ్.. ఈమధ్యన పబ్లిక్ గానే కనబడుతుంది.
అయితే తాజాగా మలైకా అరోరా, అర్జున్ కపూర్ లు కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే మాల్దీవులకు వెళ్లిన మలైకా అక్కడ బుల్లి బుల్లి డ్రెస్సులతో మత్తెక్కిస్తోంది. ఇక తాజాగా ఈ ప్రేమ పక్షులు స్విమ్మింగ్ పూల్ లో సైక్లింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మలైకా అరోరా - అర్జున్ కపూర్ లు స్విమ్ సూట్ లో పూల్ లో హ్యాపీ గా సైక్లింగ్ చెయ్యడమే కాదు.. ఆగిపోయిన తర్వాత అర్జున్ కపూర్ అల్లరి గా మలైకా అరోరా ని సైకిల్ మీద నుండి పూల్ లోకి తోసేసి.. ఎంజాయ్ చేసిన వీడియో వైరల్ గా మారింది. మరి ఈ జంట మాల్దీవుల్లో చేసే రచ్చ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.