Advertisement
Google Ads BL

బిగ్ బాస్ లో మా సపోర్ట్ వాళ్ళకే


బిగ్ బాస్ సీజన్ 5 లో ఆఖరికి ఆరుగురు మిగిలారు.. ఈ రోజు నామినేషన్స్ లో ఉన్న ఐదుగురిలో ఎవరో ఒకరు ఇంటి నుండి వెళితే.. టాప్ 5 లో ఉన్న వారిలో బిగ్ బాస్ విన్నర్ గా ఎవరు గెలుస్తారో అనే ఆసక్తి బుల్లితెర ప్రేక్షకుల్లో ఎక్కువైంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారిలో షణ్ముఖ్ ని ఎక్కువగా సపోర్ట్ చేసిన వాళ్ళే.. అతని ఆట తీరు చూసి సైలెంట్ అయ్యారు. ఇక ఇప్పుడు విన్నర్ రేస్ లో ఉన్న సన్నీకి, శ్రీరామ్ చంద్రకి సపోర్ట్ పెరుగుతుంది బయట. ట్రాన్సజెండర్ తమన్నా మరో ట్రాన్సజెండర్ ప్రియాంకని సపోర్ట్ చేస్తాను అన్న రెండు రోజులకే ప్రియాంక ఎలిమినేట్ అయ్యింది.

Advertisement
CJ Advs

ఇక బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ తాను ఎవరికి సపోర్ట్ చెయ్యను అంటూనే తనకి సన్నీ టాస్క్ పెరఫార్మెన్స్ నచ్చింది అంటూ చెప్పడంతో.. రాహుల్ సిప్లిగంజ్ సపోర్ట్ సన్నీకే అని అందరూ ఫిక్స్ అయ్యారు. ఇక బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన రవి శ్రీరామ్ చంద్రకి సపోర్ట్ చేస్తాను అని స్టేజ్ పై చెప్పి వెళ్ళాడు. ఇక గత సీజన్ రన్నర్ అఖిల్ సార్థక్ తన సపోర్ట్ శ్రీరామ చంద్రకి అని చెప్పాడు.. సో ఇలా తమ సపోర్టింగ్ కంటెస్టెంట్స్ పై సోషల్ మీడియాలో ట్వీట్స్ చెయ్యడంతో వారికి క్రేజ్ మొదలైంది. దానితో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా శ్రీరామ చంద్ర - సన్నీ మధ్యలో గట్టి పోటీ పడేలా కనబడుతుంది వ్యవహారం. 

Rahul Sipliganj declares his support to sunny:

Akhil Sarthak declares his support to Sri Ram Chandra
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs