Advertisement
Google Ads BL

వణికిస్తున్న ఒమైక్రాన్ వేరియెంట్


మరోసారి కరోనా కొత్త వేరియెంట్ ఒమైక్రాన్ ఇండియాలో విజృంభిస్తోంది. నిన్న ఆదివారం దేశంలో 16 ఒమైక్రాన్ కేసులు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. నిన్నటి ఒమైక్రాన్ కేసులతో కలుపుకుని దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 21కి పెరిగింది. ఒమైక్రాన్ వేరియెంట్ సోకిన వారి నుండి వారు కలిసిన ప్రతి ఒక్కరికి కరోనా కొత్త వేరియెంట్ చాల త్వరగా సోకడంపై అందోళన కలిగించే అంశం. 44 ఏళ్ల మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి నైజీరియాలోని లాగోస్ నుంచి గత నెల 24న పూణె చేరుకుంది. అక్కడినుండి ఆమె పింప్రి-చించ్‌వాడ్ పరిధిలో నివసిస్తున్న తన సోదరుడి వద్దకు వెళ్లింది.

Advertisement
CJ Advs

ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు నైజీరియా నుంచి వచ్చిన తల్లీ కుమార్తెలతోపాటు ఆమె సోదరుడు, అతడి ఇద్దరు కుమార్తెలు కలిపి మొత్తం ఆరుగురికి పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారి నమూనాలను పూణెలోని జాతీయ వైరాలజీ ఇనిస్టిట్యూట్‌లో పరీక్షల కోసం పంపారు. ఆమె కలిసిన వారికి అంటే మొత్తంగా ఆరుగురికీ ఒమిక్రాన్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఒక్క మహారాష్ట్రలోనే ఒమైక్రాన్ కేసుల సంఖ్య 8కి పెరిగింది.   రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ఆదర్శనగర్‌కు చెందిన ఒకే కుటుంబంలో 9 మంది ఒమైక్రాన్ బారినపడ్డారు. వీరు కూడా సౌతాఫ్రికా నుంచే వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే కర్ణాటకలో రెండు, గుజరాత్‌లో ఒకటి, ఢిల్లీలో ఒకటి, ముంబైలో ఒకటి చొప్పున ఒమైక్రాన్ కేసులు బయటపడ్డాయి. 

Small-Cap Stocks Hit Hard by Covid-19 Omicron Variant:

Omicron Covid variant: next test for global supply chain crisis
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs